అన్నదాతలకు గుడ్ న్యూస్..!

-

భారత వాతావరణ శాఖ అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో రైతులు ఇక నుండి ఆ సేవలను కూడా ఈజీగా పొందొచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రాంతీయ భాషల్లోనే రైతులకు వాతావరణ సూచనలు తీసుకు రావడానికి భారత వాతావరణ శాఖ సిద్ధమైంది. నేరుగా రైతుల ఫోన్లకే ఈ వివరాలు వస్తాయి. ఎస్ఎంఎస్ రూపంలో అన్నదాతలు వాళ్ళ ప్రాంతం వాతావరణ వివరాలను తెలుసుకోవచ్చు.

farmers

దేశ వ్యాప్తంగా ఈ సేవలు ఇస్తున్నారు. అయితే మరి రైతులు వాతావరణ వివరాలను ఎలా పొందొచ్చు అనేది చూస్తే.. దీని కోసం రైతులు ఒక ప్రత్యేకమైన నెంబర్‌కు కాల్ చేస్తే చాలు. రానున్న ఐదు రోజుల్లో రైతులు ఉంటున్న ప్రాంతంలో వాతావరణ పరిస్థితులుకి సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ని ఐఎండీ నేరుగా అన్నదాతల ఫోన్స్ కి పంపుతుంది.

వర్షం, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ మొదలైన వివరాలని ఇస్తుంది కనుక రైతులు దానికి తగ్గట్టుగా పనులు చేసుకోవచ్చు. ప్రాంతీయ భాషల్లో అన్నదాతలకు వివరాలను ఇవ్వడం మంచిది. దీని వలన రైతులుకి చక్కగా సమాచారం అందుతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో ఈ సర్వీసులను తీసుకొచ్చారు. కొంత మంది రైతులకి స్మార్ట్‌ఫోన్ వాడటం రాకపోవచ్చు అలాంటి వాళ్లకి కూడా ఈ సర్వీసు బాగా ఉపయోగ పడుతుంది.

ఒక ప్రత్యేకమైన నెంబర్‌ను త్వరలో తీసుకు వస్తామని వాతావరణ శాఖ అంటోంది. నెంబర్‌కు కాల్ చేస్తే సమాచారం వచ్చేస్తుంది. అధికారులు రైతుల లొకేషన్‌లో వాతావరణ పరిస్థితులు చూసి ఫోన్లకు ఎస్ఎంఎస్ పంపుతారు. ఈ సర్వీసులు ఉచితంగానే పొందొచ్చు. ఐఎండీ మేగదూత్ పేరుతో ఒక యాప్‌ను కూడా తీసుకొచ్చారు. జిల్లా స్థాయిలో ప్రత్యేకమైన వ్యవసాయ సంబంధిత వివరాలు దీని ద్వారా పొందొచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news