అదిరిపోయే స్కీమ్ ను ప్రవేశపెట్టిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్..

-

ప్రముఖ వాణిజ్య బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్కీమ్ లను అందిస్తూ వస్తుంది. ఇప్పుడు మరో స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ మంగళవారం గృహ రుణం కోసం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.దానికి స్పాట్ ఆఫర్ అని పేరు పెట్టింది..

ఈ స్పాట్‌ ఆఫర్‌ వాట్సాప్‌లో అందుబాటులో ఉంటుంది. వాట్సాప్‌లో స్పాట్ లోన్ కింద, అర్హత కలిగిన రుణగ్రహీతలు 2 నిమిషాల్లో లోన్ ఆమోదం పొందుతారు. దీని కోసం, రుణగ్రహీతలు +91 98670 00000 నంబర్‌కు వాట్సాప్ సందేశం పంపాలి. కొంత ప్రాథమిక సమాచారాన్ని పంచుకోవాలి. మీరు పంచుకున్న సమాచారం ఆధారంగా లోన్‌ అర్హత నిర్ణయిస్తారు. WhatsAppలో స్పాట్ హోమ్ లోన్ సదుపాయం కేవలం జీతం పొందే వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఇలా చేయండి..

వాట్సాప్ లో స్పాట్ ఆఫర్ కోసం ఇలా చేయాలి..

ఇందులో ముందుగా, +91986700000000 వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని పంపండి, అది లోన్ ప్రాసెస్‌ను ప్రారంభిస్తుంది..ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, మెను నుంచి కొత్త రుణాలను ఎంచుకోండి.ఆపై స్పాట్ ఆఫర్ (కొత్తది) ఎంచుకోండి

ఎంప్లాయ్‌మెంట్ కేటగిరీలో జీతం లేదా స్వయం ఉపాధిని ఎంచుకోండి.నివాసి చిరునామాలో భారతీయ, NRI ఆప్షన్లలో ఎదో ఒకటి ఎంచుకోవాలి. మీ నివాస చిరునామా పిన్‌కోడ్‌ను నమోదు చేయండి.

పాన్ కార్డ్ ప్రకారం మీ పూర్తి పేరును పూరించండి. నిబంధన, షరతును అంగీకరించాలి. ఆ తర్వాత మీ పూర్తి సమాచారం చూపిస్తుంది. మొత్తం సమాచారం సరైనదేనా అని నిర్ధారించండి.ఈ సమయంలో నమోదు చేయవలసిన OTP వస్తుంది.మీ స్థూల నెలవారీ ఆదాయాన్ని పేర్కొనాలి. మీ ప్రస్తుత EMI గురించి సమాచారాన్ని కూడా పంచుకోండి.ఈ మొత్తం సమాచారం ఆధారంగా, ఈ ప్రిన్సిపల్ మొత్తం లోన్ అప్రూవల్ లెటర్ PDF ఫార్మాట్‌లో మీకు షేర్ అవుతుంది.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఈ లోన్‌కు సంబంధించి బ్యాంక్ ద్వారా మిమ్మల్ని సంప్రదించి తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తారు..

ఈ బ్యాంక్ హోమ్ లోన్ పై ఇప్పటికే రెండు సార్లు వడ్డి రేటును పెంచింది.ఈ నెల9 2022న, గృహ రుణాలపై వడ్డీ రేటును 0.30 శాతం పెంచుతున్నట్లు HDFC ప్రకటించింది. ఇప్పుడు బ్యాంకు కనీస గృహ రుణ వడ్డీ రేటు 7 శాతానికి పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news