సొంతింటి కల సాకారం చేసుకోవాలా? అయితే అదిరే ఆఫర్ మీకోసం…!

ఎప్పటి నుండో సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా…? మరి ఇంక ఆలోచించకండి ఇదే మీకు అదిరిపోయే ఆఫర్. ఇప్పుడు బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి… కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు పడిపోవడం వల్లనే. దీనితో ఎంతో సులువుగా మీరు లోన్ తీసుకుని ఇళ్ళని కట్టొచ్చు లేదా కొనొచ్చు. మరి ఇంక ఆలస్యం చేయొద్దు. పూర్తిగా వివరాలు తెలుసుకుని సొంతింటి కల సాకారం చేసుకోండి.

రియల్టీ సంస్థ పిరమాల్ రియల్టీ మొట్ట మొదట సారి అద్భుతమైన స్కీమ్‌ను తీసుకు రావడం జరిగింది. జీరో వడ్డీ రేటు స్కీమ్‌ను తీసుకు రావడం విశేషం. అయితే దీని వల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయానికి వస్తే… మీరు కనుక పిరమాల్ గ్రూప్‌కు చెందిన రియల్టీ కంపెనీ పిరమాల్ రియల్టీ అందిస్తున్న ఈ సున్నా వడ్డీ హోమ్ లోన్ స్కీమ్ కింద రుణం తీసుకున్నట్లయితే… 2022 మార్చి వరకు వడ్డీ చెల్లించాల్సిన పని లేదు. ఆ తర్వాత నుంచి మళ్లీ వడ్డీ రేటు వర్తిస్తుంది గమనించండి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే…? ఈ ఆఫర్ కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుంది. వాటి వివరాల్లోకి వెళితే… పిరమాల్ మహలక్ష్మీ, పిరమాల్ అరణ్య, పిరమాల్ రేవంత వంటి ప్రీమియం ప్రాజెక్టులకు మాత్రమే ఈ సౌకర్యం కలదు. ముందుగా వచ్చి బుక్ చేసుకున్న వారికి కూడా ఈ వెసులు బాటు అందుబాటు లో ఉంటుంది.