SBI: ఆధార్ లింక్ చెయ్యక పోతే ఈ ఇబ్బందులు తప్పవు…!

-

తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. మీకు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే తప్పక మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. లేదంటే కొన్ని సమస్యలు తప్పవు. స్టేట్ బ్యాంక్ ‌లో ఖాతాదారులు ఆధార్ లింక్ తప్పనిసరి చెయ్యాలి అని చెప్పింది. అయితే ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాలు పొందాలని భావిస్తే అకౌంట్‌ తో ఆధార్ లింక్ చేయాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది.

ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్ నెంబర్‌ తో లింక్ చేసుకోవాలి లేదంటే ఇబ్బందులు రావొచ్చు అని చెప్పింది. ఎస్‌బీఐ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, బ్యాంక్ బ్రాంచ్‌ ఇలా నాలుగు విధాల్లో మీరు బ్యాంక్ అకౌంట్ ‌తో ఆధార్ నెంబర్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చెయ్యొచ్చు. మీకు ఈ ఆప్షన్ బెస్ట్ అయితే దానినే ఫాలో అవ్వండి.

ఇలా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం కష్టమౌతుందని తెలిపింది. ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందొచ్చని అంది. పైగా ఏదైనా సబ్సిడీ రావాల్సి ఉంటే కూడా వెంటనే బ్యాంక్ ఖాతా లోకి ఆ డబ్బులు వచ్చేస్తాయి. మీరు బ్రాంచ్ కి వెళ్లి లింక్ చేసుకోవాలంటే ఆధార్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news