ఐసీఐసీఐ బ్యాంక్: వడ్డీ లేకుండా రూ.10 వేలు పొందొచ్చు…!

-

ఐసీఐసీఐ బ్యాంక్ లో మీకు ఖాతా ఉందా..? అయితే ఈ సదుపాయం గురించి మీరు చూడాల్సిందే..! ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్ల కోసం పే లేటర్ సదుపాయం కల్పిస్తోంది. దీనితో కస్టమర్స్ వడ్డీ లేకుండా రుణం పొందొచ్చు. మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు ఓ సూపర్ ఆఫర్ ని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ నుంచి వడ్డీ లేకుండా రుణం పొందొచ్చు. అయితే దీన్ని ఆన్‌లైన్ కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించగలం. అయితే ఈ ఫెసిలిటీ కింద కస్టమర్లు వారు వారి క్రెడిట్ లిమిట్‌ ద్వారా ఏదైనా ప్రొడక్టు కొనొచ్చు. డబ్బులు మాత్రం తర్వాత కట్టొచ్చు.

అదిరింది కదా ఈ బెనిఫిట్. అయితే కస్టమర్స్ బ్యాంక్ పే లేటర్ ఆప్షన్ ద్వారా ప్రొడక్టులు కనుక కొనుగోలు చేస్తే… వచ్చే తర్వాత నెల 15 తేదీ లోగా ఉపయోగించిన డబ్బులు పే చెయ్యాలి. 45 రోజుల వరకు వడ్డీ రహిత కాలం లభిస్తుంది. ఇది ఇలా ఉండగా కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉంది గమనించండి. ఈ బెనిఫిట్ కనుక పొందాలి అంటే బ్యాంక్ ఐమొబైల్ యాప్ ద్వారా సులువుగా పొందొచ్చు.

లేదు అంటే ఐసీఐసీఐ పాకెట్స్ యాప్, బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ సర్వీసులు మీరు పొందవచ్చు. మీరు ఒకసారి ఈ సర్వీసులు యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీ పేరు పై పే లేటర్ అకౌంట్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా మీరు పే లేటర్ సర్వీసుల ద్వారా గ్రాసరీస్ కూడా కొనొచ్చు. అంతే కాదు ఇది అమెజాన్, పేటీఎం, మొబిక్విక్, ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే చెల్లింపులకు కూడా ఉపయోగ పడుతుంది. కానీ ఇతరుల బ్యాంక్ ఖాతాకు మీరు డబ్బులు పంపించడానికి వీలుండదు.

 

Read more RELATED
Recommended to you

Latest news