పాన్‌ కార్డు పనిచేయకపోతే రూ. 6 వేలు జరిమానా కట్టాలా..?

-

ఆధార్‌ కార్డుకు పాన్‌ లింక్‌ చేయకపోతే ఆర్ధిక లావదేవీల పరంగా కొన్ని నష్టాలు జరుగుతాయని మనకు తెలుసు. పాన్‌ కార్డుకు పనిచేయకపోతే మీరు చాలా నష్టపోతారు. రూ. 6 వేల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి రావొచ్చు.. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే అవి చెల్లుబాటు కావు. అలాంటి పాన్ కార్డులు ఉన్నా కూడా లేనట్లే అవుతుంది. దీని వల్ల అలాంటి పాన్ కార్డులు కలిగిన వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు కలిగిన వారు రూ. 6 వేల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి రావొచ్చట.

పాన్ కార్డు లేకపోతే ఐటీఆర్ దాఖలు చేయడం కుదరదు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. అంటే నెల రోజులు కూడా లేదు. పాన్ కార్డు లేకపోతే ఐటీఆర్ దాఖలు చేయలేరు..అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయకపోతే పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పాన్ కార్డును ఇప్పుడు మీరు పెనాల్టీ డబ్బులు కట్టి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని భావిస్తే.. పాన్ కార్డు తిరిగి యాక్టివేట్ కావడానికి దాదాపు 30 రోజులు పడుతుంది. అంటే మీకు ఇప్పుడు ఈ ఛాన్స్ కూడా లేదాయే.

పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి ఇప్పుడు రూ. 1000 జరిమానా కట్టాలి. అప్పుడు ఆధార్ కార్డుతో దాన్ని లింక్ చేసుకోగలరు. అలాగే ఐటీఆర్ దాఖలు చేయకపోతే రూ. 5 వేలు జరిమానా పడుతుంది. రూ. 5 లక్షల వరకు ఆదాయానికి ఇది వర్తిస్తుంది. అంటే మీ పాన్ కార్డు ఇన్ఆపరేటివ్ అయితే అప్పుడు మీరు మొత్తంగా రూ. 6 వేలు జరిమానా చెల్లించాల్సిందే.. రూ. 5 వేలు ఐటీఆర్ పెనాల్టీ, రూ. 1000 పాన్ ఆధార్ జరిమానా. అందుకే పాన్ కార్డు కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

మీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షలకు లోపు ఉంటే.. అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయకపోతే రూ. 1000 జరిమానా పడుతుంది. ఈ సందర్బంలో మీరు మొత్తంగా చూస్తే రూ. 2 వేలు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే పాన్ కార్డును వీలైనంత త్వరగా ఆధార్‌తో లింక్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news