కొన్ని దేశాల్లో అబార్షన్ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరట.. అత్యాచార బాధితుల పరిస్థితేంటో..?

-

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో గర్భం దాల్చిన మహిళలకు అబార్షన్ చేయించుకోవంటం చాలా క్షిష్టమైన ప్రక్రియే. అత్యాచారం జరిగినప్పటికీ.. కొన్ని దేశాల్లో బలవంతంగా శిశువుగా జన్మనివ్వాల్సిందే అని రూల్స్ ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే పరిమితులకు మించి గర్భస్రావం జరిగితే ఆ మహిళ జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఏ దేశాలు అబార్షన్‌కు సంబంధించి కఠిన నియమాలు కలిగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

2015 లో ప్యూ రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ ద్వారా వచ్చిన నివేదికలో ప్రపంచంలోని ఏ దేశాలలో గర్భస్రావం చేయించుకోవడం అనే చాలా కష్టం అనేది ఇందులో వెల్లడించారు. డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, నికరాగువా, వాటికన్ సిటీ, మాల్టా వంటి దేశాలలో ఏ సందర్భంలోనూ అబార్షన్‌లు అనుమతించబడవని నివేదిక తేలింది.

యూరోపియన్ యూనియన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతించని ఏకైక దేశం మాల్టా. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అబార్షన్ నిరోధక చట్టం ఇక్కడ ఉంది. ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఇక్కడి వ్యక్తులకు 18 నెలల నుండి 3 సంవత్సరాల వరకైనా శిక్షించబడవచ్చు. అబార్షన్ చేసిన వ్యక్తికి 18 నెలల నుండి 4 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అంతేకాకుండా మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేకుండా లైసెన్స్ కూడా రద్దు చేస్తారట. ఘోరంగా ఉన్నాయి కదూ..మన దగ్గర ఇలాంటి చట్టాలు లేకపోవటం ఒకందుకు మంచివిషయమే.్

బ్రెజిల్‌లో.. అబార్షన్ చేయించుకోవడానికి ఒక మహిళ చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడ స్త్రీ జీవితానికి ప్రమాదం పొంచి ఉందని నిర్దారణ జరిగితే గర్భస్రావం అనుమతించబడుతుంది. చాలా ముఖ్యమైన పరిస్థితులలో మాత్రమే అబార్షన్ చేయవచ్చు.

చిలీలో గర్భస్రావం అసాధ్యం. చాలా ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అబార్షన్‌కు అనుమతి ఇవ్వబడుతుంది.

ఐర్లాండ్‌లో, నైజీరియా, ఇరాన్ లో గర్భస్రావం చట్టవిరుద్ధం. మహిళ జీవితానికి ముప్పు ఉన్నట్లయితే మాత్రమే అబార్షన్‌కు అనుమతించబడుతుంది. ఇది కాకుండా మరేదైనా కారణం చేత అబార్షన్ చేయించుకుంటే ఆ మహిళకు జీవిత ఖైదు విధిస్తారట.

సౌదీ అరేబియా.. మహిళ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న సమయంలో మాత్రమే గర్భస్రావం చేసే హక్కును ఇస్తుంది. పిండం బలహీనంగా ఉన్న, మహిళ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి మాత్రమే చట్టం అనుమతిస్తుంది. అయితే ఇక్కడ గర్భస్రావం కోసం మహిళ భర్త సమ్మతి కూడా చాలా ముఖ్యం.

సౌదీ అరేబియాలో ఉన్న నియమాలనే ఇండోనేషియాలో కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా భర్త అనుమతితో గర్భస్రావం అనుమతించబడుతుంది. మహిళ ప్రాణాలు కాపాడే క్రమంలో మాత్రమే అబార్షన్‌ అనుమతించబడుతుంది.

ఇలా కొన్ని దేశాల్లో అబార్షన్ పై ఇన్ని కఠిన ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో చాలా వరకూ అబార్షన్ పెద్ద మ్యాటర్ కాదనే చెప్పాలి. కఠిన రూల్స్ ఉన్నప్పుటి పాటింటే ప్రజలే తక్కువ. మెడిసిన్స్ లేదా ప్రత్యామ్మాయ పద్ధతుల్లో గర్భస్రావం చేయించుకుంటున్నారని వైద్యనిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news