IRCTC: రూ.5వేలు తో అదిరిపోయే టూర్… మొత్తం మూడు ప్రాంతాలని వీక్షించొచ్చు..!

-

లాక్ డౌన్ లో ఎక్కడకి వెళ్ళకపోవడం తో విసుగు వచ్చేసిందా..? ఇప్పుడు ఎక్కడికైనా వేళ్ళని అనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తక్కువ ధరలోనే అదిరిపోయే టూర్ ప్యాకేజీ ఒకటి అందుబాటులో ఉంది. ఇక ఆలస్యం ఎందుకు పూర్తి వివరాలని ఇప్పుడే చూసేయండి. వివరాల లోకి వెళితే… ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.దీని కోసం మీరు రూ.6 వేలు కడితే సరిపోతుంది. సూపర్ ట్రిప్ వేసేయొచ్చు.

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈసారి జగన్నాథ యాత్రను తీసుకు వచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో పూరి, భువనేశ్వర్, కోణార్క్ ప్రాంతాలను మొత్తం చూసి వచ్చేయొచ్చు. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ ప్రాంతాల్లో రైలు ఎక్కొచ్చు. మళ్ళీ టూర్ అయిపోయాక ఎవరి స్టేషన్స్ లో వాళ్ళు దిగొచ్చు. ఈ టూర్ మొత్తం ఐదు రోజులు పాటు ఉంటుంది. సికింద్రాబాద్‌లో నడి రాత్రి 12.05 గంటలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది.

ఇక దీని ధర విషయం లోకి వస్తే.. టూర్ ప్యాకేజీ ధర రూ.5,250గా ఉంది. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఐదు ఏళ్ళు కనుక దాటితే మాత్రం ఫుల్ అమౌంట్ కట్టాలి. స్లీపర్ క్లాస్ ధర రూ.5,250 గా ఉంది. 3 టైర్ ఏసీలో కావాలంటే రూ.6,300 చెల్లించాలి. ఇది ఇలా ఉండగా ఫుడ్, షెల్టర్ వంటివి అన్నీ ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది. అయితే ఈ ఫెసిలిటీలు అన్నీ షేరింగ్ బేసిస్‌పై ఉంటాయి గమనించండి. https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SCZBD34 లింక్ ద్వారా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news