స్టేట్ బ్యాంక్‌ ఖాతాదారులకు కొత్త సర్వీసులు… వివరాలు ఇవే…!

-

మీకు స్టేట్ బ్యాంక్‌లో ఖాతా ఉందా…? అయితే మీరు తప్పకుండ దీని గురించి తెలుసుకోవాలి. దీనితో మీరు బ్యాంక్ కి వెళ్లకుండానే ఈ సేవలని పొందొచ్చు. అకౌంట్‌కు నామినీ పేరును మీరు కనుక యాడ్ చేసుకోవాలంటే ఇంట్లో నుండే చేసేయొచ్చు. తాజాగా ఈ కొత్త సర్వీసులని స్టేట్ బ్యాంక్ అందుబాటు లోకి తీసుకు వచ్చింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

నామినీ పేరును బ్యాంక్ కస్టమర్లు ఇక ఆన్‌లైన్ ‌నుండే జత చేసుకోవచ్చు. అయితే మరి దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… నామినీ పేరును మీరు బ్యాంక్ అకౌంట్‌ లో మూడు రకాలు యాడ్ చేసుకోవచ్చు. ఒకటి మీరు నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మీ అకౌంట్ తో నామినీ పేరును జత చేసుకోవచ్చు. మరొక పద్దతి ఏమిటంటే..? ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లో చేసుకోవడం. లేదా మీరు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా నామినీ పేరు యాడ్ చేసుకోవచ్చు.

యోనో నుండి ఎలా చెయ్యాలి అనే విషయానికి వస్తే… యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ లోకి వెళ్లి.. ఇప్పుడు మీకు ఆన్‌లైన్ నామినీ ఆప్షన్ కనిపిస్తుంది. దీనితో మీరు మీ అకౌంట్‌కు నామినీ పేరు యాడ్ చేయొచ్చు. అదే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెయ్యాలనుకుంటే లాగిన్ అయిన తర్వాత రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీ లోకి వెళ్లి సులభంగా నామిని పేరు యాడ్ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news