మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్ చేతిలో పడిందా? డేటా ఉల్లంఘన జరిగిందా లేదో ఇప్పుడే తెలుసుకోండి.

-

డేట్ ఉల్లంఘన సాధారణ విషయం కాదు. మన వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్ చేతికి వెళ్ళడం ఏమాత్రమూ మంచిది కాదు. 2016లో లింక్డ్ ఇన్ సైటు యూజర్ల పాస్వర్డులు ఉల్లంఘనకి గురయ్యాయి. ఇదొక్కటే కాదు, ఇప్పటి వరకు చాలా సైట్లలో డేటా ఉల్లంఘన జరిగింది. ఇక ముందు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరూ ఆన్ లైన్ లో ఉండడం వల్ల ఇది మరింత పెరిగింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ డేటా ఉల్లంఘన చేసేవారు మన మెయిల్ ఐడి, పుట్టినతేదీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సమాచారం మొదలగు సున్నితమైన అంశాలను దొంగిలిస్తారు.

దీనివల్ల మీ పేరు మీద ఫేక్ బ్యాంక్ అకౌంట్ తీసే అవకాశం ఉంది.
మీ మెయిల్ ఐడీ పాస్వర్డులను ఉపయోగించి ఇతర అకౌంట్లను హ్యాక్ చేసే అవకాశమూ ఉంది.
అదే కాకుండా మీ మెయిల్ కి అనేక ఇతర ఫిషింగ్ మెయిల్స్ పంపించడమూ, మీ మెయిల్ ని ఉపయోగించుకుని ఇతరులకి మెయిల్స్ పంపించడమూ చేస్తారు.

ఐతే మీ డేటా, ఆన్ లైన్ అకౌంట్ ఉల్లంఘనకి గురైందా లేదా అనేది తెలుసుకోవడమెలా? దీనికోసం మీరు Haveibeenpwned.com వెబ్ సైట్ ని దర్శించాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆన్ లైన్ అకౌంట్ ఎక్కడైనా మీ సమాచారం లీక్ అయ్యిందేమో తెలుసుకోవచ్చు. ఈ సైటుకి వెళ్ళిన తర్వాత సెర్చ్ లో మీ మెయిల్ ఐడీ లేదా అకౌంట్ యూజర్ నేమ్ ఎంటర్ చేసి, pwned? అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీ డేటా లీక్ అయినట్లైతే ఇలా వస్తుంది.

అప్పుడు మీరు మీ పాస్వర్డులని మార్చుకోవాలి. అన్ని పాత పాస్వర్డులని తీసివేసి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టండి. మీ పాస్వర్డులో అంకెలు, ఆల్ఫాబెట్స్, స్పెషల్ నంబర్స్, కేపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకి ఇలా InoNothin@343#.

ఒకవేళ మీ డేటా లీక్ అవకపోతే ఇలా వస్తుంది. ఇప్పుడు పాస్వర్డులు మార్చాల్సిన అవసరం లేదు. కాకపోతే రెగ్యులర్ గా మీ మెయిల్ ఐడీ, ఆన్ లైన్ అకౌంట్ పాస్వర్డులు మారుస్తూ ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news