నేటితో ముగియనున్న తెలంగాణ నైట్ కర్ఫ్యూ.. కీలక ప్రకటన వెలువడే అవకాశం ?

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ఈ రోజుతో ముగియనుంది. కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం గత నెల 20 నుంచి 30వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

మొన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన హోంమంత్రి మహమూద్‌ అలీ రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకుని త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. లాక్ డౌన్ అవకాశం అయితే లేదని పేర్కొన్న ఆయన ఈరోజు అన్ని అంశాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేస్తారని అన్నారు. అయితే కర్ఫ్యూ పొడిగింపునకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక