కేసీఆర్ ఇస్తున్న 1500 మీ అకౌంట్లో పడలేదా.. అయితే ఇలా చెయ్యండి

-

తెలంగాణాలో లాక్ డౌన్ కారణంగా పేదలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక చేసుకోవడానికి పని లేక చేతులో డబ్బులు లేక వాళ్ళు పడే అవస్థలు అన్నీ ఇన్ని కాదు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో తెలంగాణా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారికి అండగా నిలవాలి అని నిర్ణయం తీసుకున్నాయి. రెండు ప్రభుత్వాలు కలిసి వారికి 1500 సహాయం చేస్తున్నాయి.

రేషన్ బియ్యం కూడా 12 కేజీలు కార్డు ఉన్న వాళ్లకు ఇస్తున్నారు. ఇక వలస కూలీలకు కూడా తెలంగాణా సర్కార్ అండగా నిలిచింది. వాళ్లకు కూడా 1500 ఇవ్వాలని 12 కేజీల రేషన్ బియ్యం ఇవ్వాలి మనిషికి అని నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో ఇచ్చిన సర్కార్ ఈ నెలలో కూడా ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇది పక్కన పెడితే…

ఇప్పుడు కొందరికి ప్రభుత్వం చేస్తున్న సాయం అందడం లేదు. జనధన్ ఖాతాలు కొందరివి ఆగిపోయాయి. నిర్వహణ భరించలేని బ్యాంకులు వాటిని పూర్తిగా ఆపేశాయి. దీనితో వారికి సహాయం అందడం లేదు. అలాగే కొందరికి కార్డు లేకపోవడం కూడా సమస్యగా మారింది. దీనితో వాళ్లకు డబ్బులు పడటం లేదు. అయితే ఏం చెయ్యాలి అనేది చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు.

స్వయంగా కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం చూస్తే… ఎవరికి అయినా సహాయం అందకపోతే స్థానిక రెవెన్యు అధికారులకు సమాచారం ఇవ్వడం లేదా డయల్ 100 కి ఫోన్ చేసి సమస్యను వివరించడం. వాళ్ళే స్వయంగా మీకు డబ్బులను అందించడం లేదా ప్రభుత్వం మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎవరు అయినా తెలియని వాళ్ళు ఉంటే ఈ సమాచారం అందించి వాళ్ళ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news