బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్‌ చేశారా ? దానిపై ఎక్కువ ఇన్సూరెన్స్‌ పొందాలనుకుంటున్నారా?

-

మీరు బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో డబ్బు డిపాజిట్‌ చేశారా? అయితే దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను మీరు తెలుసుకోవాలి. ఏదైన బ్యాంకులో మీరు డబ్బు డిపాజిట్‌ చేశారనుకోండి. ఆ బ్యాంకు దివాళా తీస్తే మీ డబ్బు పరిస్థితి ఏంటి? అయితే ఇప్పుడు మనం డిపాజిట్‌ చేసిన మన డబ్బుకు ఎలా ఇన్సూరెన్స్‌ పొందాలో తెలుసుకుందాం. బ్యాంకులు సమర్థవంతంగా పనిచేయనపుడు, ఏవైన స్కాం జరిగినపుడు అలాంటి బ్యాంకులు మూసివేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఖాతాదారుల డిపాజిట్లకు ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ హామీనిస్తుంది.

దీనివల్ల ఒకవేళ మీరు డిపాజిట్‌ చేసిన బ్యాంకులు దివాళా తీసునపుడు ఖాతాదారుల డబ్బులను ఈఐఈఏఈ ఇన్సూరెన్స్‌ను చెల్లిస్తుంది. గతంలో ఈ సంస్థ ఇన్సూరెన్స్‌ కవరేజీని రూ. 1 లక్ష వరకు ఇచ్చేది. కానీ, 2020 ఫిబ్రవరి నుంచి డిపాజిట్లకు రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజీ అమల్లోకి తీసుకువచ్చింది. అయినా కూడా ఈ మొత్తం చాలామంది డిపాజిటర్లకు సరిపోవట్లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.65 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకునే అవకాశాలపై ఖాతాదారులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఈఐఈఎఈ సేవింగ్స్‌ అకౌంట్లు, ఎఫ్‌డీ, కరెంట్‌ అకౌంట్లు, రికరింగ్‌ డిపాజిట్లు.. వంటి డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తుంది. కానీ విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, రిజర్వు బ్యాంక్‌ మినహాయించిన డిపాజిట్లకు ఇన్సూరెన్స్ వర్తించదు.
బ్యాంకు లైసెన్స్  రద్దు చేసిన తేదీ లేదా విలీనం చేసిన తేదీ నుంచి… ఖాతాదారులు తమ అసలు, వడ్డీపై రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. అన్ని రకాల డిపాజిట్లకూ ఇన్సూరెన్స్ పరిమితి అత్యధికంగా రూ.5 లక్షలుగానే ఉంది. వడ్డీ కలిపి రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటే.. ఆ డబ్బును పూర్తిగా పొందవచ్చు.
వినియోగదారులు ఒకే బ్యాంకులో వివిధ రకాల పథకాలు, డిపాజిట్లను పెట్టినా వాటన్నింటికీ రూ.5 లక్షలు చొప్పున ఇన్సూరెన్స్ లభిస్తుంది.
ఖాతాదారులు ఏదైనా సంస్థ పేరుతో ప్రొపరైటర్‌షిప్‌ అకౌంట్‌ ఉంటే.. వేర్వేరు అకౌంట్లతో ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వర్తించవు. ఈ సందర్భంలో ప్రొపరైటర్‌షిప్‌ అకౌంట్, వారి వ్యక్తిగత అకౌంట్‌తో కలిసి ఉంటుంది. దీంతో అత్యధికంగా రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ మాత్రమే పొందుతారు.

విదేశీ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు.. అన్నింటికీ వర్తిస్తుంది. కానీ ప్రాథమిక సహకార సంఘాలు, ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీలకు ఇన్సూరెన్స్ వర్తించదు.

Read more RELATED
Recommended to you

Latest news