2023 లో షాక్ ఇవ్వనున్న మొబైల్ టారిఫ్‌లు..అసలు కారణం ఇదే?

-

2023 లో మొబైల్ వినియోగ దారులకు టారిఫ్‌ ప్లానులు భారీ షాక్ ఇవ్వనున్నాయి..ఇప్పుడున్న ప్లాన్స్ కు డబుల్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. మొబైల్ టారిఫ్‌లు భారీగా పెరగనున్నాయని తెలుస్తుంది..అది నిజమైతే మాత్రం ప్రీ పెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లానులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మొబైల్ టారిఫ్‌లు కొత్త ధరలతో అందుబాటులోకి రానున్నాయి.టెలికం కంపెనీల ఆదాయంతో పాటు మార్జిన్‌లను పెంచేందుకు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం దిగ్గజాలు ప్రస్తుత ప్లాన్‌ల ధరలను 10 శాతం పెంచే యోచనలో ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

 

జియో, ఎయిర్‌టెల్‌తో సహా టెలికాం ఆపరేటర్లు వచ్చే 3 ఏళ్లలో అంటే.. 10 శాతం టారిఫ్‌ల పెంపును ప్రకటించవచ్చని భావిస్తున్నారు. మొబైల్ వినియోగదారులు రాబోయే సంవత్సరాల్లో ప్రతి నాల్గవ త్రైమాసికంలో మొబైల్ ప్లాన్‌ల ధరలలో పెరుగుదలను చూస్తారన్న మాట.. కంపెనీల రాబడితో పాటు మార్జిన్‌లపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగానే మొబైల్ టారిఫ్ ధరల పెరుగుదలకు కారణమని నివేదిక సూచిస్తుంది. మూడవ త్రైమాసికంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా జియో ..లకు టెలికాం కంపెనీ పనితీరు కీలక సూచికగా మారనుంది. ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం కుడా పెరిగింది..

ఎయిర్‌టెల్ ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లపై టారిఫ్‌లను పెంచడం ప్రారంభించింది.కాగా, ఎయిర్‌టెల్ ఇటీవలే రూ.99 ప్లాన్‌ సహా కొన్ని చౌకైన ప్లాన్‌లను తొలగించడం ప్రారంభించింది. గ్రామీణ విస్తరణలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఎయిర్‌టెల్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ 18 రోజుల పాటు 1GB డేటా, 100 మెసేజ్‌లు, Airtel Xstream, Wynk Music, Zee5 ప్రీమియం యాక్సెస్‌ను త్వరలోనే అందించనుంది.

కొన్ని రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ ధరల పెంపుతో ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. రూ.99 ప్లాన్ ఇప్పుడు రూ.155కి అందుబాటులోకి వచ్చింది.5G విస్తరణ కొనసాగుతున్న నేపథ్యంలో Vodafone Idea సబ్‌స్క్రైబర్ బేస్‌ను ఎక్కువగా ప్రభావితం చేసింది. Jio, Airtel ఇప్పటికే తమ 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని అందించడం ప్రారంభించింది. మరోవైపు, జియో, ఎయిర్‌టెల్, భారతీయ నగరాల్లోని మెజారిటీని వేగంగా అందిస్తున్నాయి.మరో రెండేళ్ళలో దేశ మంతటా 5G సేవలను అందుబాటులోకి రావాలని భావిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news