గుడ్ న్యూస్… రైతులకి మోదీ కానుక… ఇలా డబ్బులని చెక్ చేసుకోండి..!

-

మోదీ సర్కార్ అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద ఈరోజు నుంచే రూ.2 వేలుని రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేయనుంది. అయితే ఇది అన్నదాతలకు రిలీఫ్ ని తీసుకు రానుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

farmers

ప్రతీ సంవత్సరం కూడా రైతులకి పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి ఒకే విడతలో రావు. మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తాయి. ఒక్కో విడత కింద రూ.2 వేలు జమ చేస్తారు. ఇప్పటికి తొమ్మిది విడతల డబ్బులు అందాయి.

ఇప్పుడు పదో విడత డబ్బులని కేంద్రం రైతుల ఖాతా లోకి జమ చేయనుంది. ఇక మీకు ఈ డబ్బులు వస్తాయా లేదా అనేది ఇలా చూసుకోండి. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి, అక్కడ ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి బెనిఫీషియరీ స్టేటస్ ని చూడచ్చు. అలానే డబ్బులు రానట్టయితే దానికి గల కారణం కూడా మీరు చూసి తెలుసుకోచ్చు. ఇక ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి చూస్తే..

ముందుగా మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
ఇక్కడ మీకు బెనిఫీషియరి స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది.
దాని మీదనే క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. (ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్)
ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంచుకోండి.
ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఇప్పుడు మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో లేదో తెలిసిపోతుంది.
పీఎం కిసాన్ రూ.2,000 వచ్చి ఉంటే మీకు పదో విడత ఆప్షన్ కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news