గ్యాస్‌ సిలిండర్‌ వాడుతున్నారా? ఈ కొత్త రూల్స్‌ మీకు శుభవర్తే

-

మీరు గ్యాస్‌ సిలిండర్‌ వాడుతున్నారా? అయితే ఇది మీకు తీపి కబురే. రానున్న రోజుల్లో మీరు మీకు ఇష్టమైన డీలర్‌ నుంచి సిలిండర్‌ను బుక్‌ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుందని నివేదికలు లె లుపుతున్నాయి. ఈ కొత్త ఆలోచన మన కేంద్రం తీసుకోవాలని యోచిస్తోంది. దీనివల్ల చాలామంది వినియోగదారులకు ఊరట లభించనుంది. ఇక రోజుల తరబడి గ్యాస్‌ డెలివరీ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండదు. మనకు నమ్మకం ఉండి, ఏ డీలరైతే సరైన సమయంలో గ్యాస్‌ డెలివరీ చేస్తారో వారి వద్ద నుంచే సిలిండర్‌ తీసుకునే అవకాశం దక్కనుంది. దీనికి శ్రీకారం చుట్టనుంది కేంద్ర ప్రభుత్వం.

దీనికోసం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కేంద్రం తయారు చేయిస్తోందని వెలువడుతున్న కొన్ని నివేదికల తెలుపుతున్నాయి. దీని ద్వారా కస్టమర్‌ ఏ డీలర్‌ వద్దనైనా సిలిండర్‌ బుక్‌ చేసుకునే వీలుంటుంది. ఇండెన్, హెచ్‌పీ, భారత్‌ ఇలా ఏ డీలర్‌ వద్ద నుంచైనా మనం గ్యాస్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ కొత్త కనెక్షన్లపై కూడా సులభతరం చేసే సవరణలు చేసే దిశగా అడుగులు వెస్తోందని తెలిసింది.

సాధారణంగా కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోబోయేవారు కచ్చితంగా అడ్రస్‌ ప్రూఫ్‌ కావాలి. దీనికి ప్రూఫ్‌గా కరెంట్‌ బిల్లు, నల్లా బిల్లులను తీసుకునేది, లేకపోతే సిలిండర్‌ కొత్త కనెక్షన్‌ ఇవ్వరు. అయితే ఈ నిబంధనలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అడ్రస్‌ ప్రూఫ్‌ లేకపోయినా సరే కొత్త గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుందని నివేదికలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ కోసం, సిలిండర్‌ డెలివరీ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నుంచి వినియోగదారులకు ఊరట లభిస్తుందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news