భారతీయులందరికీ త్వరలోనే సరికొత్త పాస్‌పోర్టులు..!

-

ఇండియన్స్ కి కొత్త పాస్ పోర్ట్స్ రానున్నాయి. సిటిజన్లకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తదుపరి తరం ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… బయోమెట్రిక్ డేటా తో ఈ పాస్‌ పోర్టులు సురక్షితమైనవిగా రానున్నాయని ఎంఈఏ కార్యదర్శి అన్నారు.

అయితే ఈ-పాస్‌పోర్టుల లో మైక్రో చిప్‌ను పెట్టనున్నారు. ఈ చిప్ వలన కలిగే ఉపయోగం ఏమిటంటే.. ఈ చిప్ లో కీలకమైన సమాచారమంతా వుండనుందిట. పాస్‌ పోర్టు హోల్డర్స్‌కు సంబంధించిన బయో మెట్రిక్ డేటా మొత్తం అంతా కూడా ఇందులో ఉంటుంది అన్నారు.

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా అనధికారికంగా డేటా మార్పిడి అవడాన్ని ఈ సెక్యూరిటీ ఫీచర్లు నిరోధించనున్నాయి. ఇప్పటికే 20 వేల మంది అధికారులకు ట్రయల్ బేసిస్‌లో ప్రభుత్వం వీటిని ఇచ్చింది.

ట్రయల్ బేసిస్‌లో ఇవి విజయవంతమవ్వడం తో, భారతీయులందరికీ కూడా వీటిని ఇవ్వాలని అనుకుంటోంది. ఇప్పటి వరకు పాస్‌పోర్టులను పర్సనలైజ్డ్ ప్రింటెడ్ బుక్‌లెట్ల రూపంలో జారీ చేసేది. అంతర్జాతీయ గుర్తింపు లోగో తో ఈ-పాస్‌పోర్టుకు ముందు భాగంలోనే చిప్ రానుంది. దేశ వ్యాప్తంగా పని చేసే 36 పాస్‌ పోర్టు ఆఫీసులలో ఈ-పాస్‌పోర్టులను జారీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news