ఆ రాష్ట్రంలో మాస్క్ లేకుంటే నో ఎంట్రీ..అక్కడకు కూడా..

-

గత మూడేళ్ల నుంచి కరోనా మహమ్మారి జనాల పై పంజా విసురుతుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ప్రాణాలను కొల్పొయారు.. కొంత మంది ప్రాణాలతో పోరాడుతున్నారు.. ఇక పోతే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది..కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వ్యాప్థి రోజు రోజుకు పెరుగుతూ జనాలకు ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ఫోర్త్ వేవ్ భయాన్ని పెంచుతోంది. చైనాలో ఒక్కరోజులోనే కరోనా కేసులు కోట్లకు చేరాయి. చైనా బాటలో అమెరికా కూడా అనుసరిస్తోంది. జపాన్, బ్రెజిల్, దక్షిణ కొరియా వంటి దేశాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఓవైపు క్రిస్మస్ సెలవులు ప్రారంభమయ్యాయి.. మరో వైపు కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆలయాల్లోనూ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో మహారాష్ట్రలోని చాలా దేవాలయాల్లో కరోనా ఆంక్షలు మొదలు పెట్టింది. మాస్క్ ను ధరించడం తప్పని సరి చేసింది. షిరిడీ ఆలయం తో పాటు పలు ఆలయాల్లో మాస్క్ తప్పనిసరి అయ్యింది..

నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలో ఖచ్చితంగా మాస్క్‌లను ధరింపజేయాలని నిర్ణయించారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు, ఆలయ సిబ్బంది ముందు మాస్క్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కల్‌కోట్‌లోని శ్రీ స్వామి సమర్థ ఆలయంలో కూడా మాస్క్‌లు తప్పని సరి చేశారు. భక్తులు మాస్క్ ధరించి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలని ఆలయ నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు ధరించకుండా ఆలయానికి చేరుకున్న భక్తులకు దేవస్థానం వారు మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు..

అదేవిధంగా..సప్తశృంగి దేవి ఆలయంలో నో మాస్క్, నో ఎంట్రీ అనే నిబంధన కూడా అమలులోకి వచ్చింది. భక్తుల మధ్య సురక్షితమైన దూరం పాటించడంపై దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ట్రస్టు ఉద్యోగులు భక్తులను క్యూ లైన్లలో తగినంత దూరం పాటించాలని సూచిస్తున్నారు. కొల్హాపూర్‌లోని అంబాబాయి ఆలయంలో కూడా మాస్కులను తప్పని సరి చేశారు..మళ్ళీ ఇలా లాక్ డౌన్ పెట్టకుండా ముందస్తు చర్యలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news