ఈ ఆరు చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ వల్ల పర్యావరణం బాగుంటుంది..!

-

కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఆక్సిజన్ లేక జనం ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ రోజు మనం చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ గురించి చూద్దాం. ఈ ఆరు చెట్లు కనక ఉంటే ఆరోగ్యకరంగా ఉండొచ్చు మరియు పర్యావరణం కూడా బాగుంటుంది.

బోధి చెట్టు:

బోధి చెట్టు ఎంతో పవిత్రమైన చెట్టు. బోధి చెట్టు కింద కూర్చుంటే బుద్ధుడు కి జ్ఞానోదయం అయింది. ఇది 60 నుంచి 80 ఎత్తు ఎదగగలదు. ఎక్కువ ఆక్సిజన్ కూడా ఇస్తుంది.

మర్రిచెట్టు:

మర్రిచెట్టు కూడా హిందువులు పవిత్రంగా చూస్తారు ఇది కూడా ఎక్కువ ఎత్తు ఎదగగలడు. దీని నుంచి కూడా ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది.

వేప చెట్టు:

వేప చెట్టు లో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఇది నిజంగా దివ్యౌషధమని చెప్పాలి. ఈ చెట్లు కాలుష్యమైన గాలులని కార్బన్ డయాక్సయిడ్, సల్ఫర్ మరియు నైట్రోజన్ లాంటివి తీసుకుని ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి.

అశోక చెట్టు:

ఇది కేవలం ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా దీని పువ్వులు పర్యావరణాన్ని మంచిగా అందంగా ఉంచుతాయి. దీంతో పర్యావరణం కూడా బాగుంటుంది.

అర్జున చెట్టు:

ఈ చెట్టు ఎప్పుడూ ఆకుపచ్చ రంగు లోనే ఉంటుంది. దీనిలో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఇది కూడా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.

నేరేడు చెట్టు:

నేరేడు చెట్టు లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కాలుష్యమై గాలులను తీసుకుంటుంది అంటే సల్ఫర్ డై ఆక్సైడ్ మరియు నైట్రోజన్ లాంటివి గాలిలో నుండి తీసుకుని మంచి ఆక్సిజన్ ఇస్తుంది.

నిపుణులు ఏం చెబుతున్నారంటే…?

కరోనా కారణంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీనితో సోషల్ మీడియాలో చెట్లను నాటాలి అని అందరూ అంటున్నారు. నిజంగా చెట్లు ఆరోగ్యాన్ని ఇస్తాయి. Professor PD Dixit at Harcourt Butler Technical University (HBTI), Kanpur, చెప్పిన దాని ప్రకారం ఒకవేళ ఇప్పటికే ఎక్కువ చెట్లు ఉంటే ఆక్సిజన్ కొరత వచ్చేది కాదని అంటున్నారు. అసలు పర్యావరణంలో ఆక్సిజన్ ఎక్కువ లేదని చెట్లు నాటడం చాలా ముఖ్యం అని చెప్తున్నారు. అందుకే ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే చెట్ల గురించి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news