వాట్సప్ లో మరో బ్రహ్మాండమైన ఫీచర్ వచ్చింది..!

-

వాట్సప్.. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఈ పదం సుపరిచితమే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే పిక్చర్ ఇన్ పిక్చర్. దాన్నే పీఐపీ ఫీచర్ అని కూడా అంటారు. ప్రస్తుతానికి దీని బీటా వర్షన్ ను వాట్సప్ రిలీజ్ చేసింది. ఇది విజయవంతం అయితే అందరికీ ఈ ఫీచర్ అందుబాటులో రానుంది.

ఈ ఫీచర్ ద్వారా వాట్సప్ లోనే యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వీడయోలను ప్లే చేసుకోవచ్చు. అంటే వాట్సప్ చెక్ చేసుకుంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోని వీడియోలన్నింటినీ చూడొచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 4.4, అంతకంటే ఎక్కువ వర్షన్ ఉన్న ఓఎస్ లో ఇది పని చేస్తుంది.

పీఐపీ అంటే వీడియో ప్లేబ్యాక్ కోసం ఉపయోగించే మల్టీ విండో మోడ్ అన్నమాట. ఓ చిన్న విండోలో వీడియో చూసేలా అమర్చబడి ఉంటుంది. ఐఓఎస్ లో ఈ ఫీచర్ ను వాట్సప్ జనవరిలో తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్స్ కు మాత్రం త్వరలో తీసుకురానుంది. ఫేస్ బుక్ కు చెందిన వాట్సప్ కు ప్రపంచ వ్యాప్తంగా నెలకు 20 కోట్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news