బ్యాంకు ఖాతా ఫార్మ్ 60తో వద్దు…! ఎందుకంటే…!

-

ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలు అత్యవసరంగా మారిపోయాయి. వాటితో అవసరం లేకుండా ఏ ఒక్క పని జరగడం లేదు. వంట గది నుంచి ఆఫీస్ వరకు… కూడా దాని అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతీ చిన్న అవసరానికి కూడా దానిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. డబ్బులు ఆదా చేయడానికి, చెల్లింపులు, రుణాలు, వ్యక్తిగత అవసరాలు ఇలా ఎక్కడ చూసినా సరే బ్యాంకు ఖాతాల అవసరం ఉంటుంది. మొబైల్ ఫోన్ ఎలాగో బ్యాంకు ఖాతా కూడా మనకు అన్ని విధాలుగా అవసరంగా మారింది.

దీనితో ప్రతీ ఒక్కరు ఏదోక రూపంలో బ్యాంకు ఖాతాను ఓపెన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఒక జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు… చాలా మంది పాన్ కార్డ్ అవసరం లేదని చెప్పి ఫార్మ్ 60 తో బ్యాంకు ఖాతాను తెరుస్తూ ఉంటారు. అది అంత మంచిది కాదని అంటున్నారు. ఐటి రిటర్న్స్ అప్పుడు కచ్చితంగా… మీ ఆదాయం, చెల్లింపులు ఇలా ప్రతీ ఒక్కటి ఇబ్బంది అవుతుందని… ఏవైనా తనిఖీలు చేస్తే ముందు అధికారులు ఫార్మ్ 60 నే తనిఖీ చేస్తారని అప్పుడు కచ్చితంగా ఇబ్బందులు వస్తాయని,

ఫార్మ్ 60తో చేసే లావాదేవీలు కూడా చట్టబద్దం కాదు… పాన్ కార్డ్ అయితే ఎప్పటికప్పుడు నమోదు అవుతుందని… ఫార్మ్ 60లో అలా ఉండదని… ఎక్కువ లావాదేవీలు స్వేచ్చగా చేయలేరని… ఈ రోజుల్లో అధిక నగదు లావాదేవీలు జరుగుతున్నాయని… దీనితో అధికారులు ఫార్మ్ 60 మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని కచ్చితంగా మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏదైనా కొనుగోళ్ళు జరపాలి అన్నా సరే… ఫార్మ్ 60 తో చిక్కులు వస్తాయని… కాబట్టి కచ్చితంగా పాన్ కార్డ్ తోనే బ్యాంకు ఖాతా ఓపెన్ చేస్తే ఏ గొడవా ఉండదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news