PM Ujjwala Scheme 2.0: ఫ్రీ గ్యాస్ కనెక్షన్ మరియు సిలెండర్… ఇలా అప్లై చెయ్యండి..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని ప్రజల కోసం ప్రవేశ పెట్టింది. అయితే వాటిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల 2.0 స్కీమ్ కూడా వుంది. మొదటి దశ విజయవంతం కావడంతో రెండో దశను ఇటీవల ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్, సిలిండర్స్ ఇస్తారు. మొదటి దశలో కొన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉండగా.. వాళ్లకి రెండో దశలో కవర్ అవుతాయట.

PM Ujjwala Scheme 2.0

అలానే కొత్తగా ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం అంది. ఇది ఇలా ఉంటే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-PMUY స్కీమ్ మొదటి స్టేజ్ లో అయితే ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి రూ.1,600 ఆర్థిక సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వం. అయితే రెండో దశ ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్‌తో పాటు, ఉచితంగా గ్యాస్ సిలిండర్ కూడా లభిస్తుంది.

ఇక దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూస్తే.. వలస కూలీలు రేషన్ కార్డుల్ని, అడ్రస్ ప్రూఫ్‌ను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ డిక్లరేషన్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డిక్లరేషన్ ఇస్తే చాలు. అయితే ఈ పధకానికి మహిళలు మాత్రమే దరఖాస్తు చేయాలి. దారిద్య్ర రేఖకి దిగువన ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. బీపీఎల్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ ఉండాలి. అలానే ఏ ఎల్‌పీజీ కనెక్షన్ వాళ్ళ పేరు మీద వుండకూడదు. 18 ఏళ్లు దాటిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. దగ్గర్లో ఉన్న ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి కూడా అప్లై చెయ్యచ్చు. అదే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే https://pmujjwalayojana.com వెబ్‌సైట్‌లో అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news