ఎస్‌బీఐ కార్డు వారు ఆ 9 విషయాలు గుర్తించుకోవాలి..!

ఎస్‌బీబీ ఏటీఎం కార్డుతో లావాదేవీలు జరిపేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే వారి అకౌంట్‌ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారుల సౌకర్యార్థం రకరకాల సేవలు అందిస్తూ వస్తోంది. అందులో ఏటీఎం సౌకర్యం కూడా ఒక భాగమే. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఏటీఎం కార్డుతో వినియోగదారులు లావాదేవీలు జరిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇటీవల పెరిగిన సైబర్‌ నేరాల కారణంగా బ్యాంక్‌ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది.

 

జాగ్రత్తలివే..

1. మీ డెబిట్‌ కార్డు పిన్‌ నెంబర్‌ ఎవరికి కూడా చెప్పరాదు.

2. ఏటీఎం లేదా పీఓఎస్‌ మెషీన్లలో కార్డు వాడేటప్పుడు మీ పిన్‌ నెంబర్‌ పక్కవారికి కనబడకుండా చేతిని అడ్డుపెట్టుకోవాలి.
3. అప్పుడప్పుడు కార్డు పిన్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేస్తామని వచ్చే ఎస్‌ఎంఎస్‌లు, ఈ–మెయిల్స్, ఫోన్‌ కాల్స్‌కు స్పందించరాదు.
4. ఏటీఎం కార్డు మీదనే పిన్‌ నెంబర్‌ రాసుకోవద్దు.
5. మీ ట్రాన్సాక్షన్‌ అయిన తర్వాత వచ్చే రశీదును అక్కడే వదిలేయకుండా చింపివేయాలి.
6. మీ యొక్క ఫోన్‌నంబర్, పుట్టిన తేదీ, అకౌంట్‌ నంబర్‌లను పిన్‌ నెంబర్‌గా పెట్టుకోవద్దు.
7. ఏటీఎం సెంటర్, పరిసరాల్లో స్పై కెమెరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి.
8. ఏటీఎం, పీఓఎస్‌ మెషీన్లలో ట్యాంపర్‌ కీబోర్డు ఉందో,లేదో గమనించాలి.
9. మీ బ్యాంక్‌ అకౌంట్‌కు ఫోన్‌ నంబర్‌ కచ్చితంగా లింక్‌ చేసుకోవాలి. మీకు తెలియకుండా లావాదేవీలు జరిగితే వెంటనే మీకు సమాచారం తెలుస్తుంది. తద్వారా మీకు బ్యాంకు, పోలీసు అధికారులను సంప్రదించవచ్చు.