ఎస్‌బీఐ క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌లో ఉండే ఈ సేవలు మీకు తెలుసా?

-

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం సెంటర్లలో ఆటోమెటెడ్‌ డిపాజిట్‌ అండ్‌ విత్‌డ్రాయల్‌ మెషీన్లు కూడా అందుబాటులో ఉంటాయి. సాదారణంగా ఈ మెషీన్‌ తో కేవలం డబ్బులు మాత్రమే డిపాజిట్‌ లేకపోతే విత్‌డ్రా చేసుకోవచ్చని మనకు తెలుసు కానీ, దీని ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియక వినియోగదారులు ఈ మెషీన్‌ గురించి పెద్దగా పట్టించుకోరు.

మీకు దగ్గర్లో ఉన్న ఏటీఎం సెంటర్‌లో ఈ క్యాష్‌ డిపాజిట్‌ మెషిన్‌ ఉంటే దీని వల్ల మీరు చాలా ప్రయోజనాలు పొందవచ్చు. చాలావరకు పనులకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అనేక బ్యాంకింగ్‌ సేవల్ని ఆటోమెటెడ్‌ డిపాజిట్‌ అండ్‌ విత్‌డ్రాయల్‌ మెషీ న్‌
లో సులువుగా పొందవచ్చు.

అంతేకాదు ఈ ఎస్‌బీఐ ఆటోమెటెడ్‌ డిపాజిట్‌ అండ్‌ విత్‌డ్రాయల్‌ మెషీ న్‌
లో అన్ని సేవలని పేపర్‌లెస్‌గా పొందవచ్చు. క్యాష్‌ డిపాజిట్‌ చేయడం చాలా సులభం కార్డు లేకుండానే నేరుగా క్యాష్‌ డిపాజిట్‌ చేయాలనుకుంటే ఒకసారి రూ.49,900 మాత్రమే డిపాజిట్‌ చేయడం సాధ్యమవుతుంది. అంతకంటే ఎక్కువ మొత్తంలో క్యాష్‌ డిపాజిట్‌ చేయాలనుకుంటే మీ పాన్‌ నంబర్‌ తప్పనిసరి కావాలి. అలాగే డెబిట్‌ కార్డుతో కూడా రూ.2,00,000 వరకు డిపాజిట్‌ చేయవచ్చు. ఈ వెసులుబాటు కేవలం మీ సొంత అకౌంట్‌లోకి మాత్రమే కాదు, ఇతర అకౌంట్లలోకి కూడా డబ్బులు డిపాజిట్‌ చేయవచ్చు.

ఇందులో ఒకేసారి 200 కరెన్సీ నోట్లు మాత్రమే డిపాజిట్‌ చేయడం సాధ్యమవుతుంది. రూ.100, రూ.200, రూ.500, రూ.2000 కరెన్సీ నోట్లు డిపాజిట్‌ చేయవచ్చు. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో పర్సనల్‌ అకౌంట్‌లోకి డబ్బులు డిపాజిట్‌ చేస్తే ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదు. ఇతర డిపాజిట్లకు కనీసం రూ.22 తోపాటు అదనంగా జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ ఆటోమెటెడ్‌ డిపాజిట్‌ అండ్‌ విత్‌డ్రాయల్‌ మెషీన్‌ లో పీపీఎఫ్, రికరింగ్‌ డిపాజిట్, లోన్‌ అకౌంట్లకు కూడా నేరుగా డబ్బులను డిపాజిట్‌ చేయవచ్చు. ఈ మెషీన్‌‌ లో డబ్బులు కూడా డ్రా చేయవచ్చు. అంటే ఏటీఎంలా పనిచేస్తుంది. యోనో క్యాష్‌ ద్వారా కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ చేయడం కూడా చాలా సులభం. దీనికి మీకు కావాల్సింది మీ రిజస్ట్రార్డ్‌ మొబైల్‌ మీ వద్ద ఉంటే చాలు. ఏటీఎం కార్డు అవసరం లేకుండా యోనో ఎస్‌బీఐ యాప్‌తో డబ్బులు డ్రా చేయవచ్చు. యోనో క్యాష్‌ ద్వారా రూ.20,000 వరకు కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రా చేసే వెసులుబాటు ఉంది. ఈ మెషీ న్‌ లో మీ పాస్‌వర్డ్‌ కూడా అప్‌డేట్‌ చేయవచ్చు.
మీ అకౌంట్‌లో ప్రస్తుతం బ్యాలెన్స్‌ ‌ ఎంత ఉందో చూసుకోవచ్చు. అలాగే మీకు మీ అకౌంట్‌ లావాదేవీలను తెలుసుకొనుటకు మినీ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ ప్రింట్‌ తీసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌లో మీరు జరిపిన గత 10 లావాదేవీల వివరాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news