ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. టూవీలర్ కొనేందుకు రూ.2.50 లక్షల వరకు రుణం పొందే అవకాశం..!

-

ఎస్‌బీఐ అందిస్తున్న వాహన రుణాల్లో సూపర్ బైక్ లోన్ స్కీం ముఖ్యమైంది. ఈ స్కీం ద్వారా ఎక్కువ మొత్తంలో వాహన రుణాన్ని పొందవచ్చు. గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు టూవీలర్ లోన్ పొందే అవకాశం ఉంటుంది.

మన దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. ఇతర బ్యాంకుల కన్నా ఎస్‌బీఐ ద్వారానే మనకు ఎక్కువగా సేవలు అందుతుంటాయి. ఇక రుణాల విషయానికి వస్తే ఇతర బ్యాంకుల కన్నా ఎస్‌బీఐలోనే మనకు తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఎస్‌బీఐలో ప్రస్తుతం మనకు హోమ్ లోన్, వాహన రుణం, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్.. ఇలా అనేక రకాల లోన్స్ అందుబాటులో ఉన్నాయి.

sbi offers super bike loan scheme

అయితే ఎస్‌బీఐ అందిస్తున్న వాహన రుణాల్లో సూపర్ బైక్ లోన్ స్కీం ముఖ్యమైంది. ఈ స్కీం ద్వారా ఎక్కువ మొత్తంలో వాహన రుణాన్ని పొందవచ్చు. గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు టూవీలర్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఈ లోన్‌ను 5 ఏళ్ల కాలపరిమితిలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ లోన్ పొందాలంటే అందుకు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అవేమిటంటే…

* ఎస్‌బీఐ సూపర్ బైక్ లోన్ స్కీంలో వాహన రుణం పొందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు లేదా గవర్నమెంట్ సంస్థలు, కార్పొరేషన్స్, ప్రైవేటు రంగ కంపెనీలకు చెందిన ఉద్యోగులు అయి ఉండాలి.
* పన్ను చెల్లించే ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్‌మెన్ భాగస్వామ్య సంస్థలకు చెందిన వారు కూడా ఈ రుణం పొందవచ్చు.


* ఇక ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉంటే వాహనం ధరలో 90 శాతం వరకు రుణం ఇస్తారు. 21 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
* ఉద్యోగం చేసే వారు ఏడాదికి రూ.2.50 ఆపైన సంపాదన కలిగి ఉండాలి. అదే స్వయం ఉపాధి, వ్యాపారం, వ్యవసాయం చేసే వారు వార్షిక ఆదాయం రూ.4 లక్షలు కలిగి ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news