SBI సూపర్ స్కీమ్..ప్రతి నెలా అకౌంట్ లోకి డబ్బులు..

-

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది..ఇక ఎన్నో పథకాలను కూడా అందిస్తుంది..సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన సేవింగ్ స్కీమ్ ను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు మాత్రమే కాదు, ఎవరికైనా పెద్దమొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు, ఆ డబ్బులతో రెగ్యులర్‌గా ఆదాయం కావాలనుకుంటే ఇలాంటి సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. వారి కోసం ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అందిస్తోంది.. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ స్కీమ్‌లో ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తే, కస్టమర్లకు ప్రతీ నెలా కొంత అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. అసలులో కొంత మొత్తంతో పాటు, వడ్డీ కలిపి అకౌంట్‌లో జమ అవుతుంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో ఎన్ని నెలల వరకు డబ్బులు కావాలో ముందుగానే చెప్తే దాని ప్రకారం, ప్రతీ నెల సమానంగా అకౌంట్‌లోకి డబ్బులు వస్తుంటాయి..ఫిక్స్డ్ డిపాజిట్ లలో అయితే అసలు వడ్డీ ఒకేసారి ఇస్తారు..కానీ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతీ నెలా అకౌంట్‌లో డబ్బులు జమ అవుతుంటాయి. టర్మ్ డిపాజిట్‌కు ఉన్న వడ్డీ రేట్లే యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌కు వర్తిస్తాయి. సాధారణ కస్టమర్లకు ఉన్న వడ్డీ రేట్లే ఈ స్కీమ్‌కు కూడా వర్తిస్తాయి..

ఇకపోతే సీనియర్ సిటిజన్లకు అయితే 50 బేసిస్ పాయింట్స్ అంటే అరశాతం వడ్డీ ఎక్కువగా వస్తుంది. యాన్యుటీ డిపాజిట్‌లో లభించే వడ్డీకి టీడీఎస్ వర్తిస్తుంది. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేసేవారు 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు లేదా 120 నెలల కాలాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.. దాన్ని బట్టి వడ్డీ అనేది మారుతుంది..కనీసం వెయ్యి రూపాయలు అకౌంట్ లో జమ అవుతాయి..ముందుగానే డబ్బులు వెనక్కి తీసుకోవాలనుకుంటే రూ.15,00,000 వరకు అనుమతి ఉంటుంది. కానీ పెనాల్టీ ఛార్జీలు ఉంటాయి. ఒకవేళ డిపాజిటర్ మరణిస్తే ఎలాంటి లిమిట్ లేకుండా ప్రీమెచ్యూర్ పేమెంట్ ను పొందవచ్చు.. ఇప్పుడు ఈ స్కిం కు ఆదరణ పెరుగుతుంది.. దీంతో మరిన్ని బెనిఫిట్స్ ను బ్యాంకు అందించడానికి రెడీ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news