ఇల్లు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఈ నెల 10వ తేదీన ఎస్‌బీఐ మెగా ఈ-వేలం..!

-

ఎస్‌బీఐ ఈ నెల 10వ తేదీన మెగా ఈ-వేలం పాటను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా వినియోగదారులు ఆన్‌లైన్ వేలం పాటలో పాల్గొని వాహనాలు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్లను, అపార్ట్‌మెంట్లను వేలం పాడి కొనుగోలు చేయవచ్చు.

సొంతింటి కలను నిజం చేసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. ముఖ్యంగా మధ్య తరగతి వర్గానికి చెందిన వారు ఒక మోస్తరు పట్టణం లేదా నగరాల్లో సొంత ఇంట్లో ఉండాలని కలలు కంటుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఎస్‌బీఐ ఓ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఆ బ్యాంకు స్వాధీనం చేసుకున్న ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వాహనాలను వేలం వేస్తూ మెగా ఈ-ఆక్షన్ నిర్వహించనుంది.

ఎస్‌బీఐ ఈ నెల 10వ తేదీన మెగా ఈ-వేలం పాటను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా వినియోగదారులు ఆన్‌లైన్ వేలం పాటలో పాల్గొని వాహనాలు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్లను, అపార్ట్‌మెంట్లను వేలం పాడి కొనుగోలు చేయవచ్చు. కాగా ఈ వేలంలో పాల్గొనదలచిన వారు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చెల్లించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ప్రాపర్టీ విలువలో 10 శాతం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

అయితే ఇలా వేలం పాటల్లో కొనుగోలు చేసే ఇండ్లకు, ఇండ్ల స్థలాలకు న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే.. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఇండ్లను, ఇండ్ల స్థలాలను, వాహనాలనే వేలం వేస్తాయి. కనుక ఇలాంటి వేలం పాటల్లో ఆయా ప్రాపర్టీలను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ వేలం పాటలో పాల్గొనేవారు డిజిటల్ సిగ్నేచర్ చేయాలి. ఆథరైజ్డ్ ఏజెన్సీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ క్రమంలో వేలంలో పాల్గొనదలచిన వారు మరిన్ని వివరాల కోసం ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news