రోజుకు 7 రూపాయల పెట్టుబడితో… ప్రతి సంవత్సరం 60 వేల రూపాయలు..!

చాలా మంది డబ్బులని ఏదైనా స్కీమ్ లో పెట్టాలని అనుకుంటూ వుంటారు. ఆ తరవాత ఆ స్కీమ్ నుండి వచ్చిన పెన్షన్ తో హాయిగా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ వుంటారు. మీరు కూడా ఉద్యోగం సమయంలో ఇన్వెస్ట్ చేసి రిటైర్ అయ్యాక పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

money
money

ఈ స్కీమ్ కింద మీరు రోజుకు రూ. 7 కంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారి పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందవచ్చు. అదే అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్. భారత ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది.

అసంఘటిత రంగంలోని ప్రజలకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించేందుకు దీనిని తీసుకొచ్చారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. భారతీయ పౌరులు ఎవరైనా అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టచ్చు. 18-40 సంవత్సరాల వయస్సు గల వాళ్ళు దీనిలో డబ్బులు పెట్టచ్చు.

నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) ఆర్కిటెక్చర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను నిర్వహిస్తుంది. పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ సమయంలో ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ పథకంలో కనీసం 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టిన వారు మరణించే వరకు నెలవారీ పెన్షన్ ని పొందొచ్చు.

ఉదాహరణకు, మీకు 18 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం. మీరు 60 సంవత్సరాల వయస్సు నుంచి నెలవారీ పెన్షన్ రూ. 5,000 కావాలంటే, మీరు నెలకు రూ. 210 పెట్టుబడి పెడుతూ రావాలి. అంటే రోజుకి ఏడూ రూపాయిలు సేవ్ చెయ్యాలి. 40 సంవత్సరాల వయస్సులో APYలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రూ. 5,000 నెలవారీ పెన్షన్ లేదా RS 60,000 వార్షిక పెన్షన్ పొందడానికి మీరు నెలకు రూ. 1,454 విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది. అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.