మ‌రో జాతి ర‌త్నాలు..?? “తురుమ్ ఖానులు” ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీరాం నిమ్మల హీరోగా నటిస్తున్న తాజా సినిమా ” తురుమ్.. ఖాన్‌లు”. ఉత్తర సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన శ్రీరామ్ నిమ్మల.. ఇప్పుడు ఈ హ్యూమర్ జానర్ లో హీరోగా నటిస్తున్నారు. డార్క్ హ్యూమర్ జానర్ లో వస్తోన్న ఈ చిత్రం అందరిని అలరిస్తుంది దర్శకుడు తెలిపారు. “తురుమ్ ఖాన్లు” రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన మరియు థియేటర్ ఆర్టిస్టులు నటించారు. సినిమాను ఫిబ్ర‌వ‌రి లేదా మార్చిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమా కేకే సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా…. శివన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కె కళ్యాణ్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఫోటోగ్రఫీ డైరెక్టర్ గా అంబటి రాంబాబు వ్యవహరిస్తుండగా.. ఎడిటర్ గా నాగేశ్వరరావు బొంతల, మ్యూజిక్ డైరెక్టర్ గా కె ఎస్ గణన్ పని చేస్తున్నారు. ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన మరియు థియేటర్ ఆర్టిస్టులు నటించారు.

కాగా  దేవరాజ్ పాలమూరు, అవినాష్, ఐశ్వర్య ఉల్లింగళ, హర్షిత, రమ్య, సింగం విజయ్, భాస్కర్ గౌడ్, సందీప్ బద్దూరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.టైటిల్ మ‌రియు పోస్ట‌ర్ చూస్తుంటే జాతిర‌త్నాలు సినిమా గుర్తుకు వ‌స్తుంది.