ఈ స్కీమ్ తో ప్రతి నెలా చేతికి రూ.5 వేలు..!

-

మీరు నెల నెలా పెన్షన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఈ స్కీమ్. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా పెన్షన్ ని పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ స్కీమ్ ని ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ లో ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అదే .

money
money

ఈ స్కీమ్ లో మీరు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ ని తీసుకోవచ్చు. అయితే మీరు చెల్లించే దాని బట్టి పెన్షన్ వస్తుంది. ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అనేది చూస్తే… 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. బ్యాంక్ లో కానీ పోస్టాఫీస్ లో కానీ ఓపెన్ చెయ్యచ్చు. సేవింగ్స్ ఖాతా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలి.

ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరవాత నెల నెలా డబ్బులు వస్తాయి.18 ఏళ్ల వయసులో ఉన్న వారు దీనిలో చేరితే రూ.42 నుంచి రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 నుంచి రూ.5 వేలు పెన్షన్ పొందొచ్చు.

అదే ఒకవేళ 40 ఏళ్ల వయసులో ఉన్న వారు స్కీమ్‌లో చేరితే రూ.291 నుంచి రూ.1454 వరకు పే చెయ్యాలి. 18 నుంచి 39 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 వేలు కావాలనుకుంటే రూ.210 నుంచి రూ.1318 కట్టాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news