ఈ స్కీమ్ నుండి నెలకు రూ.4,950 పొందొచ్చు..!

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. దీని వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏదైనా పొదుపు పథకాల్లో చేరాలనుకుంటున్నారా? లేదా ప్రతీ నెలా కొంత ఆదాయం వచ్చే స్కీమ్స్ లో డబ్బుల్ని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు దీని గురించి చూడాలి. పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెలా మీ అకౌంట్‌లోకి డబ్బులొస్తాయి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

Postoffice
Postoffice

ప్రతీ పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఉంటుంది. ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు. మైనర్లు అకౌంట్ ఓపెన్ చేస్తే గార్డియన్ ఉండాలి. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. కనీసం రూ.1,000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. సింగిల్ అకౌంట్‌కు గరిష్టంగా రూ.4,50,000, జాయింట్ అకౌంట్‌లో రూ.9,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇక వడ్డీ గురించి చూస్తే.. ప్రస్తుతం 6.6 శాతం వడ్డీ లభిస్తోంది.

నెలకు రూ.4,950 వరకు మీరు డబ్బులు పొందొచ్చు. ఈ స్కీమ్ లో కనుక మీరు రూ.4,50,000 డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.29,700 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.2,475 మీ అకౌంట్‌లో పడుతుంది. ఇక జాయింట్ అకౌంట్‌లో రూ.9,00,000 డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.59,400 వడ్డీ వస్తుంది. నెలకు రూ.4,950 మీ అకౌంట్‌లో జమ అవుతుంది. డిపాజిట్ చేసిన ఏడాది వరకు డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ మెచ్యూరిటీ కన్నా ముందు మరణిస్తే నామినీకి డబ్బులు ఇస్తారు. పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మీరు ఈ అకౌంట్ ని పొందొచ్చు