ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ.5 వేలు పొందొచ్చు..!

ఎన్నో రకాల స్కీమ్స్ ని ప్రజలకి కేంద్రం అందిస్తోంది. వాటిలో అటల్ పెన్షన్ యోజన పథకం కూడా ఒకటి. చాలా మంది ఈ స్కీమ్ లో ఇప్పటికే చేరారు. ప్రధాని మోదీ 2015 మే 9న ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అసంఘటిత రంగంలో పని చేసే వారు లక్ష్యంగా ఈ స్కీమ్‌ను లాంచ్ చేశారు. ఆగస్ట్ 25 నాటికి అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లబ్ధిదారుల సంఖ్య 3.3 కోట్లు దాటేసింది.

money

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ PFRDA ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లి ఎక్కువ మంది ఈ స్కీమ్‌లో చేరారు. ఇక ఈ స్కీమ్ గురించి చూస్తే… ఈ స్కీమ్ లో చేరితే ప్రతీ నెలా డబ్బులు పొందొచ్చు. ఈ స్కీమ్ లో కనుక చేరాలి అంటే కచ్చితంగా మీ వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. ఈ పథకంలో చేరిన వారు నెలకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు.

60 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఈ డబ్బులు చేతికి వస్తాయి. ఈ స్కీమ్ లో కనుక చేరాలి అని అనుకుంటే బ్యాంక్ ఖాతా లేదా పోస్టాఫీస్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి. దీని కోసం మీరు స్కీమ్‌లో చేరిన దగ్గరి నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లాలి. రూ.5 వేలు పెన్షన్ పొందాలని భావించే వారు నెలకు రూ.210 నుంచి రూ.1318 వరకు చెల్లించాలి. ఇలా ఈ స్కీమ్ ద్వారా ప్రతీ నెలా డబ్బులని పొందొచ్చు.