ఈ పాలసీ లో డబ్బులు పెడితే కోటీశ్వరులు అవ్వడం పక్కా..!!

సాదారణ ప్రజల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ల వరకూ అందరూ కూడా పెట్టుబడి పెట్టాలంటే మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌నే నమ్ముతారు..ఎందుకంటే ఇందులో ఎన్నో పథకాలు అందుబాటులోకి వచ్చాయి.వాటి వల్ల చాలామంది లబ్ది పొందారు.చిన్న పొదుపు నుంచి పెద్ద పొదుపు వరకూ ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. బ్యాంకులతో పోలిస్తే ఎల్‌ఐసిలో డబ్బును పెట్టుబడిగా పెట్టడం వల్ల వడ్డీలో సాపేక్షంగా ఎక్కువ రాబడి లభిస్తుంది. డబ్బు పోతుందనే భయం కూడా లేదు. LIC కి సంబంధించి.. వివిధ పాలసీలలో పెట్టుబడి పెట్టినప్పటికీ, చాలా మందికి LIC లోని ఇతర పాలసీల గురించి తెలియదు..

LIC పథకంలో డబ్బును డిపాజిట్ చేయడం వల్ల రూ.1 కోటి వరకు కవరేజీని పొందవచ్చు. పెట్టుబడి కాలం కూడా చాలా తక్కువే. ఆ పెట్టుబడిన కేవలం 4 సంవత్సరాలు ఉంచినట్లయితే.. కోటి రూపాయల వరకు లభిస్తుంది. LIC పాలసీలలో ఉత్తమమైన ప్లాన్‌లలో ఒకటి జీవన్ శిరోమణి పథకం. ఈ పథకమే తక్కువ వ్యవధిలో పెట్టుబడిదారులను లక్షాధికారులు చేస్తుంది…

ఎల్ఐసీ జీవన్ శిరోమణి పాలసీ..

*. ఈ జీవిత బీమా సంస్థ LIC జీవన్ శిరోమణి పథకాన్ని 19 డిసెంబర్ 2017న ప్రకటించింది.

*. ఈ పథకం కింద పెట్టుబడిదారులు 4 సంవత్సరాలలో రూ. 1 కోటి పొందవచ్చు.
*. ఇది నాన్ లింక్డ్, పరిమిత ప్రీమియం చెల్లింపు మనీ బ్యాక్ పథకం.
*. ఈ పథకంలో తీవ్రమైన అనారోగ్య వ్యక్తులకు రక్షణ కూడా ఉంది.
*. జీవన్ శిరోమణి పథకంలో పెట్టుబడిదారుడు పాలసీ వ్యవధిలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం లభిస్తుంది.
*. ఈ స్కీమ్‌లో ప్రీమియం వార్షికంగా, ద్వైవార్షికంగా, త్రైమాసికంగా, నెలవారీగా చెల్లించవచ్చు.
*. ఈ పాలసీని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు.
*. పాలసీ వ్యవధిలో పెట్టుబడిదారుడు చెల్లించిన ప్రీమియం ఆధారంగా రుణం కూడా మంజూరు చేస్తారు.
*. ఈ పాలసీ కనీస నగదు విలువ రూ. కోటి, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
*. ఈ పాలసీ కాలపరిమితి 14, 16, 18, 20 సంవత్సరాలు. కానీ ప్రీమియం 4 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి. ఈ పాలసీకి కనీస వయస్సు 18 సంవత్సరాలు.

ఈ పాలసీ మెచ్యూరిటీ అయ్యేవరకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి..అందుకే ఈ పాలసీలో చేరే వారిసంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది..