తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి ఇచ్చే ఐదు పొదుపు పథకాలు ఇవే..!

-

పొదుపు చేయాలని ఆలోచన రావడమే పెద్ద సమస్య.. మీరు ఎలాగోలా పొదుపు చేద్దాం అనుకున్నా.. ఎక్కడపొదుపు చేయాలి, ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించలేం.. తక్కువ ప్రీమియం అయితే సేవ్‌ చేసుకోవచ్చు. అనుకుంటున్నారా.. ఇలా తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూ ఎక్కువ రాబడి ఇచ్చే సేవింగ్‌ స్కీమ్స్‌ కొన్ని ఉన్నాయి. మీకు నచ్చింది సెలెక్ట్‌ చేసుకుని షూరూ చేసేయండి. ఇంతకీ ఆ సేవింగ్‌ స్కీమ్స్‌ ఏంటంటే..

National Savings Certificate (NSC): నేషనల్ సేవింగ్స్‌ సర్టిఫికెట్ భారత ప్రభుత్వం యొక్క చిన్న పొదుపు పథకం. ఇందులో 5 సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాత, మీ మొత్తం డిపాజిట్, మొత్తం వడ్డీని కలపడం ద్వారా డబ్బు తిరిగి వస్తుంది. ఏప్రిల్ 1, 2023 నుంచి ప్రభుత్వం వడ్డీ రేటును 7.0 శాతం నుంచి 7.7 శాతానికి పెంచింది.

Post Office Monthly Income Scheme (POMIS): మంత్లీ సేవింగ్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం యొక్క చిన్న పొదుపు పథకం. ఈ పథకంలో, పౌరులు ఒకే మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా ఐదేళ్లపాటు ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. దీని కోసం, మీరు పథకం కింద డబ్బును కనీసం 1000, గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చెయ్యవచ్చు. దీనిపై మీకు ప్రస్తుతం 7.4 శాతం ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తోంది.

Senior Citizen Savings Scheme (SCSS): సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం అందించే స్థిర ఆదాయ చిన్న పొదుపు పథకం. ఈ పథకం కింద ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌పై అందించే అత్యధిక వడ్డీ రేట్లలో ఇది ఒకటి.

Public Provident Fund (PPF) : HDFC బ్యాంక్.. సాధారణ ప్రజలకు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీద 7.1 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఆదాయపు పన్నులో సెక్షన్ 80C కింద దీనికి పూర్తి మినహాయింపు ఉంది. మెచ్యూరిటీ తర్వాత అకౌంట్‌ను మరో ఐదేళ్లపాటూ కొనసాగించుకోవచ్చు.

Sukanya Samriddhi Yojana : కూతుర్ల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిలో సుకన్య సమృద్ధి యోజన కూడా ఒకటి. ఈ పథకంలో సంవత్సరానికి 8 శాతం చొప్పున వడ్డీ ఇస్తోంది. ఈ పథకంలో కూతుర్ల పేరు మీద ఖాతాలను తెరవవచ్చు. ఈ పథకంలో కనీసం రూ.250 డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది. ఇలా ఏటా రూ.1.5 లక్షల దాకా డిపాజిట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news