మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమాధానాలు.. 

-

పెట్టుబడుల గురించి ఆలోచించేవారు మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తున్నారు. ఈ  మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉన్న పెట్టుబడి ఇదే అని చెప్పవచ్చు. ఐతే ఇందులో పెట్టుబడి పెట్టేవారికి ఎన్నో సందేహాలు ఉండవచ్చు. అడ్వర్టైజ్మెంట్ లో చూపించిన, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి అనే దాని మీద నుండి డబ్బులను ఎక్కడెక్కడ పెట్టుబడి పెడతారనే దాని వరకు అన్నీ సందేహాలే. ఇవి తెలుసుకోవాల్సినవే అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని సమాధానాలను ఇక్కడ చూద్దాం.

 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన డబ్బు ఎక్కడకు వెళ్తుంది?

ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు పెట్టే డబ్బు కంపెనీ స్టాకుల్లోకి వెళ్తుంది. కాకపోతే ఒకే కంపెనీ స్టాకులోకి కాకుండా వివిధ రకాల కంపెనీల స్టాకుల్లోకి వెళ్తుంది. దానివల్ల ఆధారపడడం తగ్గి, బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పుడు పెట్టుబడి పెడితే ఎప్పుడైనా తీసుకోవచ్చా?

మీరు ఎంచుకున్న స్కీమును బట్టి ఈ అవకాశం ఉంటుంది. లాక్ ఉన్న ఫండ్లలో పెడితే అన్ లాక్ అయ్యేవరకు తీసుకోలేరు. అలాగే ఓపెన్ ఎండెడ్ ఫండ్లలో పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది.

నామినీ సదుపాయం ఉంటుందా?

ఖచ్చితంగా ఉంటుంది. ఈ నామినేషన్ ని ఎవరికైనా ఇవ్వవచ్చు. దీనికోసం నామినీ వివరాలు ఇస్తే సరిపోతుంది.

టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా?

టాక్స్ బెనిఫిట్స్ కావాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ లో ఈఎల్ఎస్ఎస్ అనే స్కీములు ఉంటాయి. దీనిలో సెక్షన్ 80సి కింద 1,50,000వరకు టాక్స్ బెనిఫిట్ ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news