లీనింగ్ టవర్ ఆఫ్ పీసా వంగిపోతుండడానికి కారణం ఏమిటి..?

-

లీనింగ్ టవర్ ఆఫ్ పీసా గురించి అందరికి తెలుసు. అలానే అది ఒక వైపుకు వంగి ఉంటుంది అనే విషయం కూడా తెలిసినదే. గుండ్రంగా, ఎత్తుగా ఉండే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా రోజు రోజుకి మరీ వంగిపోతోంది. ఈ కారణం మూలంగా ఈ టవర్ ఎప్పుడు కూలుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పుడు లేనే లేదు. దీనితో ఆ టవర్‌ను సరైన ప్రదేశం లో సరైన కొలతల తో నిర్మించ లేదు.

ఇలా దీనిని సరిగ్గా నిర్మించక పోవడం తో ఆరంభం నుంచి ఒక వైపుకు ఒరుగుతూ వస్తోంది. టవర్ నిర్మాణానికి కేవలం 3 మీటర్ల లోతు పునాది మాత్రమే తీశారు. అలానే టవర్ ను నిర్మించిన ప్రదేశం లో నేల స్వభావం సరిగ్గా ఉండదు. అంతే కాకుండా చుట్టూ చిత్తడి నేలలు ఉండడం తో ఇది ఆరంభంలోనే ఒక పక్కకు వంగింది. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఎత్తు వచ్చేసి 55.86 మీటర్లు. కింది భాగంలో వెడల్పు అయితే 2.44 మీటర్లు. టవర్ బరువు 14,500 మెట్రిక్ టన్నులు ఉంది.

మరో విషయం ఏమిటంటే…? ఈ టవర్ ను నిర్మించేటప్పుడు అది కూలిపోతుందేమోనని భయ పడ్డారు. అందుకోసం కింద భాగంలో నేలకు ఒక వైపు మార్పులు చేశారు. ఇలా చేయడం వల్ల అది కూలిపోకుండా అలాగే నిలిచింది. కానీ టవర్ మాత్రం ఒక వైపుకు వంగుతూనే వస్తోంది. 1990లలో ఈ టవర్ 5​1/2 డిగ్రీలకు వంగింది. ఆ తర్వాత కొన్ని మరమ్మత్తులు చేశారు. దీంతో టవర్ వంగిన కోణం 3.97 డిగ్రీలకు తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news