పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే రూ.25లక్షలు రాబడి..

-

ఎటువంటి రిస్క్ తీసుకోకుండా డబ్బులను పొదుపు చెయ్యాలానుకొనేవారికి పోస్టాఫీసు పథకాలు బెస్ట్ అనే చెప్పాలి..అందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవింగ్ స్కీమ్ కూడా ఒకటి..ఇందులో చేరితే సూపర్ ప్రాఫిట్ పొందొచ్చు. భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి స్కీమ్‌ను అందిస్తోంది. ఇంట్లో పదేళ్లలోపు ఆడ పిల్లలను ఈ స్కీమ్‌లో చేర్పించొచ్చు. ఈ పథకంలో చేరడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. రాబడి వస్తుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు..

ప్రస్తుతం ఈ స్కీమ్ కు 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది ఆకర్షణీయ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ఇందులో చేరిన వారు 15 ఏళ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా ఈ పరిమితిలో మీరు ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కూడా మారుతుంది..

ఉదాహరణకు మీరు మీ పాప పేరుపై నెలకు రూ. 5 వేలు డిపాజిట్ చేయాలని చూస్తున్నారు. ఇలా మీరు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఏడాదికి రూ. 60 వేల చొప్పున 15 ఏళ్లలో మీరు రూ. 9 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది.. అంటే వడ్డీ, అసలు కలిపితే మీకు మొత్తంగా రూ. 25 లక్షలకు పైగా వస్తాయి. రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది.. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..త్రైమాసికం చొప్పున మారుతూ ఉండొచ్చు. అందువల్ల వడ్డీ రేటు తగ్గితే.. మీకు వచ్చే రాబడి కూడా కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వడ్డీ రేటు పెరిగితే రాబడి కూడా పైకి చేరొచ్చు. అందువల్ల వడ్డీ రేటు ప్రకారం మీకు వచ్చే రాబడి కూడా మారుతుందని గుర్తించుకోవాలి. కాగా ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news