ఆపదలో ఆదుకుంటాం దయచేసి 100కు ఫోన్‌ చేయండి – తెలంగాణ పోలీస్‌

-

ఒక్క ఫోన్‌ కాల్‌ నిన్న ప్రియాంకను కాపాడిఉండేది. ఒక్క మెసేజ్‌ మొన్న మానసను రక్షించిఉండేది. ఈ రెండు దారుణాలు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసాయి. ప్రియాంక చివరి ఫోన్‌ సంభాషణను విన్న ప్రతి ఒక్కరు కన్నీటిపర్యంతమయ్యారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇద్దరు అమ్మాయిల అమానుష హత్యాకాండ, సభ్య సమాజాన్ని కన్నీరు పెట్టిస్తోంది. పోలీసులు కూడా తీవ్రంగా బాధపడుతున్నారు. భావి జీవితాలను ఎంతో అందంగా ఊహించుకున్న అమాయకపు ఆడపిల్లలను నలిపేసి చిదిమేసిన కంటకులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు చేధించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసారు. హత్య కేసులో మొత్తం ఐదుగురునిందితులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మక్తల్‌ మండలం జక్లేరుకుచెందిన ప్రధాన నిందితుడు మహ్మద్‌ పాషా, మక్తల్‌ మండలం గుడిగండ్లకు చెందినచెన్నకేశవులు, జొల్లు నవీన్‌, జొల్లు శివను పోలీసులు అరెస్ట్‌ చేశారు.పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.వీరందరూ లారీలపై పనిచేస్తారు.

జరిగిన దుస్సంఘటనపై కదిలిపోయిన రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌, ఈ కేసును తనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని ట్విటర్‌ వేదికగా తెలిపారు. డిజిపీ మహేందర్‌ రెడ్డి, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనర్లు మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌లతో సహా యావత్తు పోలీసు సిబ్బంది కూడా తీవ్ర మనోవేదనకు గురై, కేసును వ్కక్తిగతంగా చాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఫలితమే తెల్లారేసరికల్లా నిందితులను అరెస్టు చేయడం. అక్కడ వరంగల్‌లో కూడా మానసను మట్టిలో కలిపేసిన సాయిగౌడ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి అత్యంత కఠినాతి కఠినమైన శిక్ష పడాలని అందరూ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. అది కూడా సత్వరమే విధించాలని కేటీఆర్‌ను, డిజీపీని వేడుకుంటున్నారు.

ప్రజలను తీవ్ర వేదనకు గురిచేసిన ఈ రెండు ఘటలనపై తెలంగాణ డిజిపి మహేందర్‌రెడ్డి, సిటీ, వరంగల్‌ కమిషనర్లు, మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌, రవిందర్‌లు స్పందిస్తూ, ప్రజలకు విజ్ఞప్తి చేసారు. పోలీసు ఫోన్‌ నంబర్లు, వాట్సప్‌ నంబర్లు, టోల్‌ఫ్రీ నంబర్లను దయచేసి వాడాల్సిందిగా సూచించారు. ముఖ్యంగా ‘100’ను ఏ అత్యవసర సందర్భంలోనైనా కాల్‌ చేయొచ్చనీ, ప్రమాదాలు, నేరాలు , ఘోరాలు జరిగిన తర్వాతే చేయాలని కాదని ఈ సందర్భంగా వారు ప్రజానీకానికి తెలియజేసారు. మీకేదైనా సహాయం కావాల్సివచ్చినా, ప్రమాద పరిస్థితుల్లో ఉన్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఏదైనా కీడు శంకించినా, మీరేదైనా ప్రమాదాన్ని గమనించినా, వీధిలో పబ్లిక్‌ న్యూసెన్స్‌ జరుగుతున్నా, పెళ్లిళ్లు, ఊరేగింపుల పేరుతో అర్ధరాత్రి వరకు బాజాలు, డిజేలు మోగిస్తున్నా, అగ్నిప్రమాదాలైనా, రోడ్డు ప్రమాదాలైనా 100 కు డయల్‌ చేయవచ్చు. ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేదు. ఎవరికేం సహాయం కావాల్సివున్నా, 100కు ఫోన్‌ చేయవచు్.

ముందుగా 100 డయల్‌ చేయగానే హైదరాబాద్‌ కేంద్ర సర్వర్‌కు కాల్‌ వెలుతుంది. వారు మనం ఎక్కడున్నామని అడుగుతారు. చెప్పగానే ఆ సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం వెళుతుంది. అక్కన్నుంచి మనకు కాల్‌ వస్తుంది విషయం చెప్పమని. అంతే.. పది నిమిషాల్లో వ్యాన్‌ వస్తుంది. ఏ సహాయమైనా చేస్తుంది.

మంత్రి కేటీఆర్‌, డిజిపి, కమిషనర్‌ల సూచనల ప్రకారం ఈ కింద పోలీసుల సూచనలు, అన్ని రకాల హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇస్తున్నాము. దయచేసి నోట్‌ చేసుకోండి. మీ మొబైల్‌లో ‘హాక్‌ ఐ’ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news