జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి..!

-

మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే సింగిల్ గా కంటే జాయింట్ హోమ్ లోన్ Joint home loan తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలని పొందొచ్చు. చాలా మంది సింగిల్ లోన్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అయితే దాని కంటే కూడా మీరు మీతో పాటు మీ దగ్గరి వారు అంటే భార్య, కూతురు, కొడుకు వంటి వారిని కో అప్లికెంట్లుగా చేర్చుకొని జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే మంచిది.

అయితే ఇలా లోన్ తీసుకోవడం వలన కలిగే లాభాలు గురించి చూస్తే.. కో- అప్లికెంట్‌ను చేర్చుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అలానే లోన్ ఎలిజిబిలిటీ కూడా పెరుగుతుంది. అదే విధంగా ఎక్కువ మొత్తంలో లోన్ ని పొందొచ్చు. ఈఎంఐ కూడా తక్కువ పడుతుంది.

కో అప్లికెంట్ ని చేర్చితే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ప్రైమరీ అప్లికెంట్, కో- అప్లికెంట్ ఇద్దరూ కూడా ఈ లోన్ తాలుక ఈఎంఐ కడుతున్నప్పుడు ట్యాక్స్ బెనెఫిట్స్ పొందవచ్చు.

సంవత్సరానికి రూ. రెండు లక్షల చొప్పున పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సెక్షన్ 24బి కింద ఈ మినహాయింపును ఇద్దరూ పొందవచ్చు.

అదే విధంగా 80సి కింద మరో 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనెఫిట్స్ పొందవచ్చు. ఇలా జాయింట్ ఎకౌంట్ తీసుకోవడం వలన ఇలాంటి లాభాలు కలుగుతాయి. దీనితో ఎన్నో విధాలుగా లాభాలు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news