డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు…!

-

సంక్రాంతికి సొంత ఊరు వెళ్ళాలి అని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి…? అయితే ఈ సమయంలో ప్రయాణాలు చాలా మందిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రయాణాలు చేయడానికి ఆర్ధిక స్తోమత ఉండదు చాలా మందికి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారి ఆర్ధిక స్తోమత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక తరుచు ప్రయాణాలు చేసే వారికి కూడా ఆర్ధికంగా ప్రయాణానికి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారికి ఐఆర్సిటీసి ఒక గొప్ప సదుపాయం కల్పిస్తూ ఆదుకుంటుంది.

మీరు ఐఆర్‌సీటీసీలో రెగ్యులర్‌గా టికెట్లు బుక్ చేస్తూనే ఉంటారు. మీరు ముందు టికెట్ బుక్ చేసుకుని తర్వాత పే చేయవచ్చు. మీరు ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ‘బుక్ నౌ, పే లేటర్’ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ, ePayLater సంస్థతో కలిసి 2018లోనే ‘బుక్ నౌ, పే లేటర్’ సర్వీస్ ప్రారంభించింది. కాని చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. అయితే ఈ మధ్య దీనిని వాడుకునే వారి సంఖ్య పెరిగింది. సడెన్‌గా జర్నీ ప్లాన్ చేసుకునేవాళ్ళు, ‘బుక్ నౌ, పే లేటర్’ సర్వీస్ ద్వారా వెంటనే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

మీ దగ్గర డబ్బులు లేకపోతే టికెట్ బుక్ చేసుకునే సమయంలో ‘బుక్ నౌ, పే లేటర్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మీరు ముందుగా ePayLater అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓటీపీ యాక్టివేషన్ కోసం ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పాన్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. మీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ‘బుక్ నౌ, పే లేటర్’ ఆప్షన్ ఎంచుకొని టికెట్ బుక్ చేయగానే, ePayLater వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ePayLater ఐడీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కాగానే మీ తరఫున ePayLater డబ్బులు చెల్లిస్తుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. టికెట్ బుక్ చేసిన 14 రోజుల లోపు 3.5%+పన్నులను అదనంగా చెల్లించాలి. ఆ తర్వాత వడ్డీ చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news