అఖిల్ నెక్ట్స్ మూవీ ఆ హిట్ డైరెక్ట‌ర్‌తో ఫిక్స్‌..

-

`అఖిల్‌` చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ అనుకున్న స్థాయిలో అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు. వినాయక్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా.. అఖిల్‌కు పెద్ద దెబ్బే తగిలింది. ఆ త‌ర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘హలో’ మ‌రియు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `మిస్టర్ మజ్ను` రెండు సినిమాలు కూడా అఖిల్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా అఖిల్‌ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట అఖిల్‌. ఇక‌ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గీత గోవిందం చిత్రంతో స‌క్సెస్ అందుకున్న ప‌ర‌శురామ్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నించాడు. ఆ క్ర‌మంలోనే ఓకే అనుకున్న‌ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో ప్రస్తుతం అఖిల్ సినిమా మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news