అందమైన సూర్యోదయం చూడాలనుకుంటే.. ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!

-

సూర్యోదయం.. అప్పుడప్పుడే కొండల చాటు నుంచి, చెట్ల కొమ్మల మధ్యలో నుంచి నెమ్మదిగా పొడుస్తున్న సూర్యుడిని చూడాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఉదయం లేవడం బద్ధకమై కొందరు.. వేచి చూసే ఓపికలేక మరికొందరు ఆ ప్రయత్నం మానుకుంటారు.

కానీ కొందరు మాత్రం సూర్యోదయాన్ని చూడాలనే ఆశతో తెల్లవారుజామున లేవమే కాదు ఎక్కడైతే అందమైన సూర్యోదయం కనిపిస్తుందో ఆ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఏ వీధి చివరో.. పక్క ఊరికో కాదు.. ఏకంగా వేల కిలోమీటర్లు ప్రయాణించి సన్​రైజ్​ని చూడటానికి వెళ్తారు. అలా మన దేశంలో అద్భుతమైన సూర్యోదయ దృశ్యం ఆవిష్కృతమయ్యే అందమైన ప్రదేశాలున్నాయి. మరి అవేంటో.. ఎక్కడున్నాయో తెలుసుకుందామా..?

ది బెస్ట్ సన్​రైజ్ దృశ్యం చూడాలంటే ఒడిశాలోని పూరీకి వెళ్లాల్సిందే. ఇక్కడ చిలికా సరస్సు మధ్యలో నుంచి సూర్యుడి ఉదయిస్తున్నట్లు కనిపించే సూర్యోదయ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. అందుకే చాలా మంది సూర్యోదయాన్ని వీక్షించడానికి తెల్లవారుజామునే ఇక్కడికి క్యూ కడతారు. ఫొటోగ్రాఫర్లు కూడా ఈ సన్​రైజ్ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించడానికి ఇక్కడి వస్తుంటారు.

వారణాసిని.. ది సిటీ ఆఫ్ లైట్ నగరంగా పిలుచుకుంటాం. పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ ఎప్పుడు గంగానదిలో దీపాలు నగరానికి కాంతిని వెదజల్లుతుంటాయి. ఈ ఆధ్యాత్మక క్షేత్రంలో గంగానది ఒడ్డున కూర్చొని ఉదయించే సూర్యుడిని చూస్తుంటే కలిగే పారవశ్యం మాటల్లో చెప్పలేము. ఓ వైపు ఆధ్యాత్మిక భావన.. మరోవైపు మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అక్కడికి వచ్చే భక్తులు ఈ అనుభూతి పొందాలని తపిస్తూ ఉంటారు.

ది ల్యాండ్ ఆఫ్ కింగ్స్.. రాజస్థాన్​లోని అందమైన ప్రదేశం మౌంట్ అబూ. ఇక్కడి నుంచి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే కలిగే ఫీలింగే వేరు. ఇక్కడ నక్కి సరస్సులో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్లు కనిపించే దృశ్యం ముగ్దమనోహరంగా ఉంటుంది.

కేరళ.. పచ్చని ప్రకృతికి.. అందమైన ప్రదేశాలకు నిలయం. ఇక్కడి బీచ్​లు, బ్యాక్ వాటర్స్ మరింత ప్రసిద్ధమైనవి. ఇక్కడ చాలా ప్రదేశాల్లో సూర్యోదయం అందంగా కనిపిస్తుంది. మీరు కేరళ వెళ్లారంటే.. అక్కడున్నన్ని రోజులు సన్​రైజ్​ని ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా.

డార్జిలింగ్​లోని టైగర్ హిల్స్ అనే ప్రాంతంలో ఎవరెస్ట్ తర్వాత హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కాంచన్‌జంగా కొండల వెనుక నుంచి సూర్యుడు ఉదయిస్తాడు. చనిపోయేలోగా ఈ దృశ్యాన్ని చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి సన్​రైజ్ లవర్స్ ఇంకెందుకు ఆలస్యం. ఈ సారి అందమైన సూర్యోదయాన్ని ఆస్వాదించాలనుకుంటే ఈ ప్రదేశాలకు ఓ సారి టూర్ వేయండి.

Read more RELATED
Recommended to you

Latest news