ఉత్తర భారతంలోని ఉత్తమ పర్యాటక ప్రాంతాలు..

భారతదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంస్కృతి, సాంప్రదాయం ఉంటుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. దక్షిణాదిన ఒకలా ఉంటే ఉత్తరాదిన ఇంకోలా ఉంటుంది. పర్యాటకాన్ని ఇష్టపడేవారి ఈ భిన్నత్వం చాలా గమ్మత్తుని కలిగిస్తుంది. అందుకే విభిన్న ప్రాంతాలను, అది కూడా భారతదేశంలో చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం భారతదేశంలోని ఉత్తర భారతంలో ఉన్న ఉత్తమ పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

ఢిల్లీ

ఉత్తర భారతదేశం గురించి మొదలుపెడితే మొదటగా ఢిల్లీ గురించే చెప్పుకోవాలి. దేశ రాజధాని అని మాత్రమే కాకుండా, నగరం నలువైపుల స్మారక కట్టడాలు, అద్భుతమైన వాస్తు శిల్పం, అబ్బురపరిచే ప్రభుత్వ భవనాలు, ఇండియా గేట్, ఎర్రకోట, జామా మసీదు, కుతుబ్ మినార్, హుమాయూన్ సమాధి, చాందినీ చౌక్, రాజ్ ఘాట్, అక్షర ధామ ఆలయం, రాష్ట్రపతి భవనం చూడవచ్చు.

రాజస్థాన్

రాజస్థాన్ లో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించేది అక్కడ రాజభవనాలే. జైపూర్, ఉదయ్‌పూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, అజ్మీర్, పుష్కర్, బికనీర్ వంటి నగరాల్లో అద్భుతమైన కోటలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. ఏనుగు, ఒంటె సఫారీలు ముచ్చటగొలుపుతాయి. మౌంట్ అబూ హిల్ స్టేషన్ చెప్పుకోదగ్గది.

జమ్మూ కాశ్మీర్

హెవెన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే జమ్మూ కాశ్మీర్ ని ఒక్కసారైనా సందర్శించాల్సిందే. కాశ్మీర్ అందాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. శ్రీనగర్, గుల్మార్గ్, ఉధంపూర్, కుప్వారా, కార్గిల్, సోన్మార్గ్, పుల్వామా, పహల్గామ్, దోడా, పూంచ్, అనంతనాగ్, బారాముల్లా మొదలగు ప్రాంతాలు పర్యాటకానికి అనుకూలంగా ఉంటాయి.

హిమాచల్ ప్రదేశ్

ప్రకృతి ఒడిలో గడపాలనుకునే వారికి హిమాచల్ ప్రదేశ్ మంచి ప్రదేశం. అందమైన లోయలు అద్బుతంగా ఉంటాయి. కులు, మనాలి, సిమ్లా, ముస్సోరి, చంబా, ధర్మశాల డల్హౌసీ, కాంగ్రా, కసౌలి, రోహ్ తంగ్ ప్యాలస్ మొదలగునవి చూడముచ్చటగా ఉంటాయి.

ఉత్తరాఖండ్

ఈ రాష్ట్రం పుణ్య క్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతీ ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. హిమాలయాల ఒడిలో ఉండే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్, నైనిటాల్, హరిద్వార్, హ్రిషికేష్, బద్రినాథ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, రాజాజీ నేషనల్ పార్క్, నాయిని పీక్, కేదార్ నాథ్ టెంపుల్ మొదలగునవి ఆకర్షణీయంగా ఉంటాయి.