లాక్‌డౌన్ వేళ ప్ర‌త్యేక రైళ్ల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన కేంద్రం‌..!!

-

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా వైర‌స్ ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఎప్పుడు ఎటు నుంచి ఈ మ‌హ‌మ్మారి వ‌చ్చి ప‌ట్టేస్తుందో తెలియక ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకూ 1.45 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మ‌రోవైపు 22 లక్షల మంది వైరస్ బారినపడి.. హాస్ప‌ట‌ల్‌లో పోరాడుతున్నారు. భార‌త్‌లోనూ క‌రోనా వైర‌స్ విశ్వ‌రూపం చూపిస్తోంది. ఇక్క‌డ సైతం రోజురోజుకు క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది.

అయితే ఇప్ప‌టికే కేంద్రం భార‌త్‌లో లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు కూడా తీసుకుంటుంది. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింది. ఎన్నో కంపెనీలు మూత‌ప‌డ్డాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో.. ఇటీవ‌ల మోదీ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిగించారు. ఈ క్ర‌మంలో ర‌వాణా శాఖ సైతం స్తంభించిపోయింది. కానీ, గూడ్స్ రూళ్లు, అత్యవసర, నిత్యావసర వస్తువల సరఫరా చేసే వాహనాల‌కు లాక్‌డౌన్ మిన‌హాయింపు ఉంది.

ఇక తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా ఓ రెండు ప్రత్యేక రైళ్లకు న‌డిపేందుకు క్రేందం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఏప్రిల్ 17, 18 తేదీల్లో ఈ రైళ్లు తిరగనున్నాయి. కాగా, బెంగుళూరు, బెళగావి, సికింద్రాబాద్, గోపాల్‌పుర్‌లోని శిక్షణ కేంద్రాల్లో ఉన్న సైనికులను.. ఉత్తర, ఈశాన్య సరిహద్దులకు తరలించేందుకు ఈ రెండు రైళ్లను నడపాలని రైల్వే శాఖను భారత సైన్యం కోర‌డంతో కేంద్రం అనుమ‌తి ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లోని సైనికులను ఆయా సరిహద్దులకు తరలించేందుకు రైల్వే శాఖ సాయంతో రెండు ప్రత్యేక రైళ్లను న‌డ‌ప‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news