వ్యాక్సిన్ టూరిజం: పర్యాటకానికి వెళ్తే వ్యాక్సిన్ ఫ్రీ.. రష్యా సరికొత్త ప్యాకేజీ

-

కరోనా మహమ్మారి కారణంగా బాగా దెబ్బతిన్నా వ్యాపారాల్లో పర్యాటకం ఒకటి. మిగతా వాటన్నింటికంటే పర్యాటకం బాగా నష్టపోయింది. బయటకి వెళ్తేనే ప్రమాదం కాబట్టి, ఈ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. మొదటి వేవ్ కారణంగా మూసుకుపోయిన పర్యాటక స్థలాలన్నీ ఇప్పుడిప్పుడు తెరుచుకుంటున్నాయి. ఇలా తెరుచుకుంటున్నప్పటికీ ఒక్కో దేశంలో ఒక్కో వేవ్ వస్తుండడంతో, అనేక నియమ నిబంధనలు పర్యాటకానికి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటక రంగ సంస్థలు సరికొత్త ప్యాకేజీని ముందుకు తీసుకొస్తున్నాయి.

తాజాగా రష్యా తీసుకొచ్చిన ప్యాకేజీ అందరికీ ఆసక్తి కలిగిస్తుంది. రష్యా పర్యాటకానికి వెళ్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తుందట. రష్యాలోని అందాలని చూడడంతో పాటు మహమ్మారితో పోరాడే శక్తిని పొందవచ్చన్నమాట. రష్యా తయారు చేసిన స్పుతిక్ వీ వ్యాక్సిన్ ని పర్యాటకులకు ఫ్రీగా ఇస్తుందట. రెండు డోసులను ఉచితంగానే ఇస్తుందట. దుబాయ్ కి చెందిన ట్రావెల్ ఏజెన్సీ అందిస్తున్న ఈ ప్యాకేజీపై భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇండియాలో వ్యాక్సిన్ కొరత ఇటువైపుగా మళ్ళిస్తుందని అంటున్నారు.

ఢిల్లీ నుండి మాస్కో చేరుకునే ప్రతీ ఒక్కరూ ఈ సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ప్యాకేజీ 1.29లక్షలుగా ఉంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ రెడీ అయింది. 28మందితో కూడిన పర్యాటక బృందం రష్యా సందర్శనకి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. వీరు మే 29వ తేదీన విమానం ఎక్కనున్నారు. ఆ తర్వాత సెకండ్, థర్ద్ బ్యాచ్ మే 7, 15వ తేదీలో బయలు దేరనుంది. ప్రస్తుతానికి రష్యాకి వెళ్ళడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఐతే పర్యాటకం వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన ఏ దేశం తమ నియమ నిబంధనలని మారుస్తుందో తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news