రైల్వే శాఖకు షాక్ ఇచ్చిన విజయవాడ ప్రయాణీకులు..

-

దసరా పండుగ రద్దీని క్యాష్ చేసుకోవడానికి ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను మూడింతలు పెంచేసింది. సాధారణంగా రూ.10 ఉండే ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరను రూ.30కి పెంచారు. ప్రతి సంవత్సరం ఇలా ఒక వారం రోజులపాటు పెంచడం సహజమే. కానీ, ఈసారి ఏకంగా 3రెట్లు పెంచేశారు. గతంలో రూ.10 ఉండే టిక్కెట్ ధరను రూ.20గా చేసేవారు. కానీ ఈసారి ఏకంగా 30 రూపాయలు చేసారు. దసరాలో ప్లాట్‌ఫామ్‌పై రద్దీ తగ్గించేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే విజయవాడ జనం మాత్రం రైల్వే అధికారులకు అదిరిపోయే షాక్ ఇచ్చారు.

సాధార‌ణంగా దసరా.. సంక్రాంతి వంటి పెద్ద పండుగలప్పుడు రైల్వే స్టేషన్లకు తమవారికి వీడ్కోలు చెప్పడానికి, వచ్చిన వారిని రిసీవ్ చేసుకోవడానికి బంధువులు, స్నేహితులు వస్తుంటారు. ఈ క్ర‌మంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ కు వచ్చిన తమ వాళ్ళను రిసీవ్ చేసుకోడానికి వచ్చిన వాళ్లు ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకోకుండా గుంటూరు ప్యాసింజర్ రైలుకి టిక్కెట్ తీసుకుంటున్నారు. దీనికి కార‌ణం విజయవాడ నుండి గుంటూరు కి టిక్కెట్ 10 రూపాయలు ఉండడంతో ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ తీసుకుంటే 30 రూపాయలు అవుతుందని ప్రయాణీకులు అధికారుల‌కు షాక్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news