గుడ్ న్యూస్: ఒకే కుటుంబంలో ఉన్నా LTC పొందొచ్చు….!

-

కేంద్రం LTC మీద స్పష్టత ఇచ్చేసింది. అయితే సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్లకి రెండు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మొదటిది వాళ్లకి ఒకవైపు లేదా రెండు వైపులకీ అయ్యే డబ్బులు ఇస్తారా..? , మరొకటి ఏమిటంటే ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి LTC కి క్లెయిమ్ చేసుకోవచ్చ…? అయితే దీని మీద కేంద్రం క్లారిటీ ఇచ్చిందనే చెప్పవచ్చు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే…. ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలను పరిష్కరించడానికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (LTC) నిబంధనలు 1988 చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

సాధారణంగా కేంద్ర ఉద్యోగాలు ఒక వైపు ప్రయాణానికి ఖర్చు లేదా..? రెండు వైపుల నుంచి ఖర్చులు చెల్లించాలా…? అనే ప్రశ్న కలిగి ఉంటుంది. అయితే అదే సమయంలో ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది కూడా LTC ని క్లెయిమ్ చేయడానికి అర్హులు అయితే వాళ్ళు దానిని పొందగలరా లేదా…? అయితే ఇక ఈ విషయానికి వస్తే 2017 కార్యాలయ మెమోరండం లో పలు నిబంధనలు పేర్కొనడం జరిగింది. దీని మేరకు ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గరలో ఉన్న విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ లేదా బస్ టెర్మినల్ కు వెళితే అతనికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నుంచి అయ్యే ఖర్చు గరిష్ట మొత్తం చెల్లించబడుతుంది. 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిన ఖర్చు ప్రభుత్వం పెడుతుంది.

కానీ వంద కిలోమీటర్ల దాటితే అతనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొన్న లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది ఉద్యోగులు ఒక ప్రశ్న అడిగారు. వంద కిలోమీటర్లు ఒక పక్క లేదా రెండు పక్కల అని… దీని మేరకు ఫిబ్రవరి 4, 2021న క్లారిటీ వచ్చేసింది. 200 కిలోమీటర్ల వరకు మొత్తం ప్రయాణానికి చార్జీలు చెల్లిస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా ఒకే కుటుంబానికి చెందిన చాలా మంది వ్యక్తులు LTC ప్రయోజనాలు తీసుకోవచ్చా…? అనే విషయానికి వస్తే కుటుంబంలో ఉన్న వేర్వేరు వ్యక్తులు ప్రైవేట్ టాక్సీలు లేదా ఇతర వాహనాలు ఉపయోగించడాన్ని బట్టి వాళ్లకి వేరు వేరు ప్రయోజనాలు కలుగుతాయని అవి తీసుకోవచ్చు అని కేంద్రం చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version