ఆరోగ్య శ్రీ కార్డు లేదా..? అర్హతలు, లాభాలు మొదలైన వివరాలివే..!

-

ఏపీ ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటిల్లో ఆరోగ్య శ్రీ కూడా ఒకటి. ఇది బాగా పాపులర్ అయ్యింది పైగా చాలా మంది ఈ స్కీమ్ ని వినియోగించుకుంటున్నారు. ఈ స్కీమ్ ని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందుబాటులోకి తీసుకువచ్చారు.

 

దీని వలన పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందుతున్నారు. ఇక ఈ కార్డు లేకపోతే ఎలా పొందాలి..?, ఈజీగా ఎలా అప్లై చేసుకోవచ్చు అనే వాటి కోసం చూద్దాం. ఏపీ గవర్నమెంట్ అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలతోపాటుగా రవాణా, భోజన, వసతి సదుపాయాలను కూడా ఇస్తోంది. ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది లాభం పొందుతున్నారు.

ఎవరు ఈ కార్డు పొందడానికి అర్హులు..?

ఎస్సార్ పింఛన్, జగన్నన్న విద్యా, వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా అర్హులు.
అన్ని రకాల బియ్యం కార్డులు ఉన్నవారు కూడా ఈ కార్డు పొందొచ్చు.
రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది.

2 వేలకు పైగా రోగాలకు వర్తింపు:

మొదట ఈ పధకాన్ని 1059 రోగాలకు సేవలు అందించేవారు కానీ ఆ సంఖ్యను 2434కు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా వైద్యం చేయించుకోవచ్చు. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ని పొందొచ్చు. ట్రీట్మెంట్
రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.

ఈ కార్డుని ఎలా పొందొచ్చు..?

ఈ కార్డుని పొందాలి అంటే సులభంగానే పొందొచ్చు. దగ్గరిలోని గ్రామ సచివాలయానికి వెళ్లి ఆరోగ్య శ్రీ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఆరోగ్య శ్రీ కార్డు కోసం ఫ్యామిలీ ఫోటో తో పాటుగా రేషన్ కార్డు కూడా అవసరం. అలాగే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఇన్‌కమ్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి.

అధికారిక వెబ్‌సైట్: https://www.ysraarogyasri.ap.gov.in/

Read more RELATED
Recommended to you

Latest news