యువత రూపాయి ఆదా చేసుకోలేకపోవడానికి కారణం అదేనా…!

-

గతంతో పోలిస్తే ఆదాయ మార్గాలు అనేవి క్రమంగా పెరుగుతున్నాయి… ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు… ఉద్యోగంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేయడమే కాకుండా… పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చాలా వరకు కష్టపడుతున్నారు… అయితే ఆధిక శాతం మంది ఆర్ధిక జీవనంలో నానా కష్టాలు పడుతున్నారు… నెల తిరిగే సరికి వాళ్ళ వద్ద రూపాయి ఉండటం లేదు అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అర్ధమవుతుంది.

అసలు దీనికి కారణం ఏంటీ అనేది మనం ఒకసారి చూస్తే… ఈ సమస్య ఎక్కువగా యువతలోనే ఉంది. ఉదాహరణకు నెలకు పది వేలు సంపాదిస్తుంటే ఆ పదివేలకు సరిపడా ఖర్చుని ముందే నిర్ణయించుకోవడం ఇబ్బంది పెడుతుంది. సినిమాలకు, షికార్లకు, పక్కన వాళ్ళను చూసి పుట్టే కోరికలకు… ఇలా ప్రతీ విషయంలోను ఖర్చుని ముందే నిర్దేశించుకోవడం ఇబ్బంది పెడుతున్న అంశం… నెల నెలా అనుభవాలు ఎదురవుతున్నా సరే వారిలో మాత్రం మార్పు రావడం లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

క్రెడిట్ కార్డుల ద్వారా కోరికలను పెంచుకోవడం, వాటికి వడ్డీలు కట్టడం, అప్పులు చేయడం వాటిని తీర్చడం, అనవసర వస్తువులను పదే పదే కొనుగోలు చేయడం, ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సరే పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అనే ధోరణిలో వెళ్ళడం, క్రికెట్ బెట్టింగ్ లు వంటి వాటితో యువత దాదాపుగా నాశనమవుతుంది. రూపాయి దాచడానికి మార్గాలు వెతుక్కోవాల్సిన యువత… ఖర్చు చేయడానికి వెతుక్కోవడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం… ఆర్ధిక జీవనానికి ఇది ఎంత మాత్రం మంచి అలవాటు కాదనే విషయాన్ని యువత గుర్తించాలి.

Read more RELATED
Recommended to you

Latest news