200 ప‌ట్ట‌ణాల్లో జియోమార్ట్ సేవ‌లు.. వాట్సాప్ ద్వారా స‌రుకుల డెలివ‌రీ..

-

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌కు పోటీగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ జియో మార్ట్ సేవ‌ల‌ను ఇటీవ‌లే ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆరంభంలో కేవ‌లం ముంబై, పూణెల‌లో మాత్ర‌మే జియో మార్ట్ ప‌నిచేసింది. అయితే ప్ర‌స్తుతం ఈ సేవ‌ల ప‌రిధిని విస్త‌రించారు. దీంతో దేశ‌వ్యాప్తంగా 200 ప‌ట్ట‌ణాల్లో ప్ర‌స్తుతం జియో మార్ట్ సేవ‌లు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి.

jio mart now available in 200 towns in india

ఇక ఫేస్‌బుక్ జియోలో పెట్టిన పెట్టుబ‌డుల కార‌ణంగా వాట్సాప్ ద్వారా జియోమార్ట్ సేవ‌ల‌ను వినియోగ‌దారులు పొందే అవ‌కాశం ల‌భించింది. వాట్సాప్‌లో వారు త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేస్తే కొన్ని గంట‌ల్లోనే స‌రుకులు ఇంటి వ‌ద్ద‌కే డెలివ‌రీ వ‌స్తాయి.

కాగా జియోలో కేవ‌లం ఫేస్‌బుక్ మాత్ర‌మే కాకుండా ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు కూడా భారీ ఎత్తున వాటాల‌ను కొనుగోలు చేశాయి. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో జియో మార్ట్ సేవ‌ల‌ను దేశంలో మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news